ఘనంగా మహాత్మ జ్యోతి రావు పూలే 131వ వర్ధంతి వేడుకలు

Published: Monday November 29, 2021

జగిత్యాల, నవంబర్ 28 (ప్రజాపాలన ప్రతినిధి): జిల్లా బీసీ సంక్షేమ సంఘం ఆదివారం రోజున మహాత్మ జ్యోతిరావు పూలే 131వ వర్ధంతిని జిల్లా కేంద్రంలోని తహసిల్ చౌరస్తాలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు గాజుల నాగరాజు మాట్లాడుతూ గొప్ప మానవతా మూర్తి, సంఘ సంస్కర్త జ్యోతిరావు పూలే వారి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. బడుగు బలహీన వర్గాల ఉన్నతికి, విద్యార్థుల విద్యాభ్యాసం కొరకు అలుపెరుగని కృషి చేసిన యోధులు, మహానుభావులు అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘం అధ్యక్షులు బోగోజి ముకేష్ కన్న, మహోదయ్, ఆంజనేయులు, నితిన్, వంశి, వెంకటేష్, రాకేష్, అఖిల్, రూపేష్, రాజేందర్, చంద్రమౌళి, ప్రవంజన్, రాహుల్ కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.