డబుల్ బెడ్ రూమ్ నిర్మాణపు పనులను వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ నిఖిల

Published: Tuesday October 19, 2021
వికారాబాద్ బ్యూరో 18 అక్టోబర్ ప్రజాపాలన : జిల్లాలో డబుల్ బెడ్ రూమ్ నిర్మాణపు పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ నిఖిల సంబంధిత ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో సంబంధిత ఆర్ అండ్ బి, పంచాయతీ రాజ్, ఇరిగేషన్ మరియు మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారులతో డబుల్ బెడ్ రూమ్ నిర్మాణపు పనుల పురోగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఇప్పటి వరకు చేపట్టిన పనులను వేగవంతం చేసి ఆరు నెలల్లో పూర్తి చేయాలనీ ఆదేశించారు. పరిగి, దోమ, పూడూర్ మండలాల్లో మిగిలివున్న పనులను త్వరలో పూర్తి చేయాలనీ ఆదేశించారు. నవాబుపేట మండలంలో జి ప్లస్ టు నిర్మాణపు పనులను చేపట్టెందుకు స్థానిక సర్పంచ్, తహసీల్దార్ లను సంప్రదించి పనులను వేగవంతం చేయాలని సూచించారు. కుల్కచర్ల మండలంలో వెంటనే స్థల సేకరణ జరగాలన్నారు. స్థలం సేకరణ, టెండర్ ల ప్రక్రియ పనులను త్వరగా పూర్తి చేయాలని, పనులలో నిర్లక్ష్యం వహించకూడదని ఆదేశించారు. వికారాబాద్, మర్పల్లి మండలాల్లో పురోగతిలో ఉన్న పనులను ఫిబ్రవరి, 2022 వరకు మోమిన్ పేటలో ఏప్రిల్ వరకు పూర్తి చేయాలని ఆదేశాంచారు. వికారాబాద్ రైల్వే బ్రిడ్జి వద్ద మునుముందు ఏలాంటి ఇబ్బందులు ఎదురైనా ట్రాఫిక్ సమస్యలను అధిగమించేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపట్టాలని ఆర్ అండ్ బి అధికారిని ఆదేశించారు. రెవిన్యూ, ఆర్ అండ్ బి రైల్వే శాఖల అధికారులు సంయుక్తంగా సర్వే చేపట్టాలన్నారు. సిద్దలూరు బ్రిడ్జి పనులను వెంటనే చేపట్టి సమస్య పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్లు మోతిలాల్, చంద్రయ్య, వికారాబాద్ ఆర్ డి ఓ ఉపేందర్ రెడ్డి, ఆర్ అండ్ బి డి ఈ శ్రీధర్ రెడ్డి, ఉమేష్ కుమార్, ఇరిగేషన్ ఈఈ సుందర్, మున్సిపల్ కమీషనర్ శరత్ చంద్ర, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడి రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.