అన్నదైవం ప్రాజెక్ట్ చేప పిల్లల పంపిణీ

Published: Thursday October 29, 2020
ఒక లక్ష ఎనభై ఒక వేయి ఐదు వందల చేప పిల్లల పంపిణీ 
---మండలంలోని అన్నదైవం  ప్రాజెక్టుల్లో  ఒక లక్ష ఎనభై ఒక వేయి ఐదు వందలు చేప పిల్లలు  పంపిణి 
---జిల్లా మత్స్యశాఖ అధికారి వరదారెడ్డి వెల్లడి. 
 
భద్రాద్రికొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండలం ప్రజా పాలన అక్టోబర్, 28.
 
 భద్రాద్రి జిల్లాలో ఒక కోటి 75 లక్షల చేపపిల్లల పెంపకమే లక్శ్యంగా పనిచేస్తున్నట్టు జిల్లా మత్స్య శాఖాధికారి  వరదారెడ్డి వెల్లడించారు. బుధవారం అన్నపురెడ్డిపల్లిలో ఏర్పాటు చేసిన చేప పిల్లల పంపిణీ కార్యక్రమం స్థానిక ప్రజాప్రతినిధుల సమక్షంలో ఒక లక్ష 81 వెయ్యి 500  చేప పిల్లలను అన్న దైవం ప్రాజెక్టులోకి వదిలారు. 
 
అన్నదైవం ప్రాజెక్ట్ 90 హెక్టార్లు విస్తీర్ణం గల చెరువు నీటిలో బొచ్చ( కట్ల) 72 వేల ఆరు వందల ,రోహు( రవ్వ) 90 వేల ఏడు వందల యాభై, వింగాల 18 వేల నూట యాభై ఇలా పలు రకాల చేప పిల్లలను నీటిలోకి వదిలారు.
 
ఈ కార్యక్రమానికి హాజరైన స్థానిక ప్రజా ప్రతినిధులు మాట్లాడుతూ.. గ్రామలలోని చెరువులలో మూడు రకాల (బొచ్చా, సీలవతి, మోసు) చేప పిల్లల పంపిణీ చేయడం  జరిగిందన్నారు..తెలంగాణ ప్రభుత్వం గత నాలుగు సంవత్సరాలుగా స్థానిక మత్స్యకారులను ఆదుకునేందుకు సొసైటీల ద్వారా ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు.  గ్రామాల్లోని పంచాయతీల పరిధిలోని చెరువులకు చేప పిల్లలను పంపిణీ చేయడం ముఖ్య విషయమని అన్నారు.
 
చేప పిల్లల పంపిణీ గొప్ప కార్యక్రమం స్థానిక జడ్పీటిసి భరత లావణ్య: 
 
ముఖ్యమంత్రి కెసిఆర్ మత్స్యకారుల కుటుంబాల సంరక్షణ కోసం వారికి ఉచితంగా చేప పిల్లల పంపిణీ చేయడం హర్షించదగ్గ విషయమని.. ఈ పధకం వల్ల మత్స్యకారుల  కుటుంబాలు కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారని.. దీనివల్ల పేద  మత్స్యకారులకు లబ్ధి చేకూరుటమే కాకుండా స్థానిక ప్రజల్లో పౌష్ఠికాహార లోపాన్ని అధిగ మించేవీలుందన్నారు చేపలను ఆహారంగా తీసుకోవడం వల్ల  ప్రజల్లో రోగనిరోధక శక్తి పెరిగి ఆరోగ్యకర సమాజం ఏర్పడుతుందని జడ్పిటిసి భరత లావణ్య అన్నారు.
 
నీటిలో వదిలిన చేపపిల్లలను సంరక్షించుకోవాలి: జిల్లా మత్స్య శాఖాధికారి  వరదారెడ్డి
చేప పిల్లలను ప్రతి నెలకు తప్పకుండా పర్యవేక్షిస్తూ ఉండాలన్నారు.వాటికి  కూడా  వ్యాధులు సంక్రమిస్తాయి కాబట్టి   కావాల్సిన మందులను,  ఆహారాన్ని తప్పక అందించాలని దీని ద్వారా వందకు వందశాతం మత్స్యకారులు లాభాలు పొందుతారని వివారించారు. జిల్లా వ్యాప్తంగా ఒక కోటి 75 లక్షల చేపపిల్లల పెంపకమే లక్ష్యంగా ముమ్మరంగా పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని వరద రెడ్డి తెలిపారు
 
 ఈ కార్యక్రమంలో పాల్గొన్న మత్స్యశాఖ ఫీల్డ్ఆఫీసర్ ఎన్.కోటేశ్వరరావు,సిబ్బంది రాంబాబు, అనిల్,భార్గవ్
 ప్రజాప్రతినిధులు, తెరాస యువజన అధ్యక్షుడు భారత రాంబాబు,తొట్టిపంపు సర్పంచ్ చిరంజీవి, సెక్రటరీ ప్రశాంత్, లాకావత్ సత్యనారాయణ, సమ్ములు,సైదులు, మురళీ, మత్స్యశాఖ సొసైటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.