ప్రత్యేక వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి

Published: Saturday May 29, 2021

ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
పటాన్చేరు, ప్రజాపాలన ప్రతినిధి : నియోజక వర్గంలో సూపర్ స్ప్రేడర్లకు ఏర్పాటు చేసిన ప్రత్యేక వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని అర్హులైన వారందరూ సద్వినియోగం చేసుకోవాలని స్థానిక శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి కోరారు. శుక్రవారం పటాన్చేరు పట్టణంలోని జిహెచ్ఎంసి మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ లో సూపర్ స్ప్రేడర్ల కు ఏర్పాటు చేసిన ప్రత్యేక వ్యాక్సినేషన్ కేంద్రాన్ని సందర్శించి, వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని పరిశీలించారు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ శుక్ర, శని వారాలలో వ్యాక్సినేషన్ టీకా వేయుటకు, సమాచార పౌర సంబంధాల శాఖ పరిధిలోని జర్నలిస్టులకు, వ్యవసాయ శాఖ పరిధిలోని ఎరువులు, పెస్టిసైడ్స్, విత్తనాలు డీలర్లు హమాలీలు పౌర సరఫరాల శాఖ పరిధిలోని చౌక ధరల దుకాణాల డీలర్లు, గుమస్తాలు వర్కర్లకు, ఎల్పిజి గ్యాస్ పంపిణీ వర్కర్లకు పెట్రోల్ బంకుల్లో పనిచేసే వర్కర్లకు వ్యాక్సినేషన్ టీకాలు ఇస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు ప్రతిరోజు ప్రజల మధ్య ఉంటూ సేవలందించే వారిని ప్రభుత్వం సూపర్ స్ప్రేడర్ల లుగ గుర్తించి, వారు కరోనా బారిన పడకుండా ఉండేందుకు  వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. సంబంధిత అధికారులు గుర్తించిన సూపర్   స్ప్రేడర్లలందరూ తమకు కేటాయించిన వాక్సినేషన్ కేంద్రాలలో టీకా తీసుకోవాలని ఎమ్మెల్యే కోరారు. వ్యాక్సినేషన్ కేంద్రాలలో భౌతిక దూరం పాటించాలని, తప్పకుండా మాస్కులు ధరించాలని, వ్యక్తి గత పరిశుభ్రత పాటించాలని  కోరారు. అలాగే  రామచంద్రాపురం డివిజన్ పరిధిలోని కానుకుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన స్పెషల్ వాక్సినేషన్ డ్రైవ్ కేంద్రాన్ని శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు మెట్టు కుమార్ యాదవ్, పుష్ప నగేష్, సింధు ఆదర్శ్ రెడ్డి, బల్దియా డిప్యూటీ కమిషనర్ బాలయ్య, తహశీల్దార్లు మహిపాల్ రెడ్డి, శివ కుమార్,తెరాస సీనియర్ నాయకులు విజయ్ కుమార్, ఎస్సై కోటేశ్వరరావు,వివిధ శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు