దేశ భవిష్యత్తును మార్చేది యువత ** సిపిఎం రాష్ట్ర సభ్యులు రవి కుమార్ **

Published: Wednesday February 22, 2023

 

ఆసిఫాబాద్ జిల్లా ఫిబ్రవరి 21 (ప్రజాపాలన,ప్రతినిధి) : జిల్లాలోని ఆసిఫాబాద్, కాగజ్నగర్, పట్టణ కేంద్రాలలో డివైఎఫ్ఐ 2023 క్యాలెండర్ ఆవిష్కరణ సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు బండారి రవికుమార్ చేతులమీదుగా  ఆవిష్కరించారు. మంగళవారం విలేకరుల సమావేశంలో రవికుమార్ మాట్లాడుతూ దేశ భవిష్యత్తు యువత చేతిలోనే ఉందని అన్నారు. దేశంలో బిజెపి ప్రభుత్వం వచ్చిన తర్వాత యువతకు తీరని అన్యాయం చేసిందని ప్రభుత్వ శాఖలలో అనేక ఉద్యోగాలు ఖాళీ ఉన్నప్పటికీ వాటిని భర్తీ చేయడంలొ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ ప్రైవేటు పరం చేయడానికి పూనుకుంటుందని అన్నారు. దేశ భవిష్యత్తు యువత చేతిలోనే ఉంటుందని తమ హక్కుల కోసం పోరాటం చేయాలని ఈ సందర్భంగా అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి కూషణ రాజన్న, కమిటీ సభ్యులు కోట శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి గోడిసెల కార్తీక్, రాజ్ కుమార్ లు పాల్గొన్నారు.ఆసిఫాబాద్ జిల్లా ఫిబ్రవరి 21 (ప్రజాపాలన,ప్రతినిధి) : జిల్లాలోని ఆసిఫాబాద్, కాగజ్నగర్, పట్టణ కేంద్రాలలో డివైఎఫ్ఐ 2023 క్యాలెండర్ ఆవిష్కరణ సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు బండారి రవికుమార్ చేతులమీదుగా  ఆవిష్కరించారు. మంగళవారం విలేకరుల సమావేశంలో రవికుమార్ మాట్లాడుతూ దేశ భవిష్యత్తు యువత చేతిలోనే ఉందని అన్నారు. దేశంలో బిజెపి ప్రభుత్వం వచ్చిన తర్వాత యువతకు తీరని అన్యాయం చేసిందని ప్రభుత్వ శాఖలలో అనేక ఉద్యోగాలు ఖాళీ ఉన్నప్పటికీ వాటిని భర్తీ చేయడంలొ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ ప్రైవేటు పరం చేయడానికి పూనుకుంటుందని అన్నారు. దేశ భవిష్యత్తు యువత చేతిలోనే ఉంటుందని తమ హక్కుల కోసం పోరాటం చేయాలని ఈ సందర్భంగా అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి కూషణ రాజన్న, కమిటీ సభ్యులు కోట శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి గోడిసెల కార్తీక్, రాజ్ కుమార్ లు పాల్గొన్నారు.