శాంతిఖని గనిలో సేఫ్టీ మేనేజ్మెంట్ పై అవగాహన సదస్సు

Published: Wednesday November 09, 2022
బెల్లంపల్లి నవంబర్ 8 ప్రజా పాలన ప్రతినిధి: బొగ్గు గనుల్లో సేఫ్టీ మేనేజ్మెంట్ ప్లాన్, ఇంప్లిమెంటేషన్ మరియు పర్యవేక్షణ అనే అంశంపై  అవగాహన సదస్సును మందమర్రి ఏరియాలోని శాంతిఖని గనిపై మంగళవారం కార్పొరేట్ జిఎం గురువయ్య ఆదేశాల మేరకు గని ఆవరణలో నిర్వహించారు. ఈసదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన బెల్లంపల్లి రీజియన్ రక్షణ జి యం, జాన్ ఆనంద్ మాట్లాడుతూ, సేఫ్టీ మేనేజ్మెంట్ అమలు చేసే ప్లాను, పర్యవేక్షణ, మీద సలహాలు, సూచనలు, పాటించాల్సిన పద్ధతులను, క్షుణ్ణంగా వివరించారు.
ఈ కార్యక్రమంలో
 మందమర్రి ఏరియా జీఎం, చింతల శ్రీనివాస్, ఏరియా రక్షణ అధికారి ఓదెలు, ఏజెంట్ కె.రాజేందర్, ఎస్ ఓ ఎం, ఎస్ ఎమ్ టీ సి ఇంచార్జి విజయ్ కుమార్, గని మేనేజర్ సంజయ్ కుమార్ సిన్హా, రక్షణ అధికారి పి.రాజు, పిట్ ఇంజనీర్ రాంబాబు, మరియు పిట్ సెక్రెటరీలు దాసరి శ్రీనివాస్, దాసరి తిరుపతి గౌడ్, గని అధికారులు, సూపర్ వైజర్లు మరియు టెక్నీషియన్లు, తదితర కార్మికులు పాల్గొన్నారు.