పీలారంలో బతుకమ్మ చీరలు పంపిణీ : గ్రామ సర్పంచ్ కొంపల్లి బారతమ్మ

Published: Wednesday October 13, 2021
వికారాబాద్ బ్యూరో 12 అక్టోబర్ ప్రజాపాలన : చేనేత కార్మికుల ఆర్థిక స్థితిగతులు మెరుగు పరచడమే లక్ష్యంగా బతుకమ్మ చీరలు పంపిణీ చేస్తున్నామని సర్పంచ్ కొంపల్లి భారతమ్మ నర్సిములు అన్నారు. మంగళవారం వికారాబాద్ నియోజకవర్గ పరిధిలోని పీలారం గ్రామంలో రేషన్ డీలర్ మాణిక్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి జ్యోతి ఆధ్వర్యంలో గ్రామ మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. పీలారం గ్రామానికి 359 చీరలు వచ్చాయని పేర్కొన్నారు. 18 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకు బతుకమ్మ చీరలు అందజేస్తామన్నారు. బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో భాగంగా గ్రామంలో మొదటి చీరను మంగలి రుక్కమ్మకు అందజేశామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు మామిడిపల్లి మల్లారెడ్డి, అంగన్వాడి టీచర్ శోభ, రైతుబంధు అధ్యక్షుడు చాన్ పాష, ఎస్సీ సెల్ అధ్యక్షుడు హెచ్.నర్సిములు, ఆశవర్కర్ బాలమణి, టిఆర్ఎస్ నాయకులు మహమ్మద్ పాష, ఆర్.వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.