మోడీ రాకను వ్యతిరేకిస్తున్నాం రేగుంట చంద్రశేఖర్

Published: Thursday November 10, 2022
బెల్లంపల్లి నవంబర్ 9 ప్రజా పాలన ప్రతినిధి: తెలంగాణకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోగా, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తూ తెలంగాణకు రావడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, మోడీ రాకను అడ్డుకుంటామని సిపిఐ బెల్లంపల్లి నియోజకవర్గ ఇన్చార్జ్ రేగుంట చంద్రశేఖర్ అన్నారు.
బుధవారం నాడు స్థానిక బాబు క్యాంప్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు,
18 నెలల క్రితమే ప్రారంభించిన ఎరువుల కర్మాగారాన్ని
ప్రధాని మోడీ పునఃప్రారంభం పేరుతో ఈనెల 12న రామగుండం రావడానికి ప్రయత్నం చేయటం  కుట్రలో భాగమేనని,
మోడీ రావడాన్ని భారత కమ్యూనిస్టు పార్టీ తరపున "మోడీ గో బ్యాక్"  అనే నినాదంతో అడ్డుకోవడానికి సిద్దంగా ఉన్నామన్నారు. 
తెలంగాణ ఆవిర్భావం సందర్భంగా విభజన సమయంలో మోడీ ప్రభుత్వం ఇచ్చిన హామీలైన వరంగల్ కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణం, బయ్యారం ఐరన్ ఫ్యాక్టరీ, గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు, ఆంధ్రాలో కలిపిన ఏడు మండలాలను తిరిగి తెప్పిస్తానని ఇచ్చిన హామీలను మరిచాడని, ప్రభుత్వ రంగ సంస్థలైన బీఎస్ఎన్ఎల్,  రైల్వే, బ్యాంకింగ్, విమానయాన రంగం, సింగరేణికి సంబంధించిన బొగ్గు బావులను ప్రైవేటు పరం చేస్తున్నాడని, ప్రపంచ బ్యాంకులలో ఉన్న నల్లధనాన్ని వెలికితీస్తానని చెప్పి నోట్ల రద్దు చేశాడని, దాని వల్ల ఉన్నవారికి లాభం చేకూరిందే తప్ప, పేదవారికి ఎటువంటి ప్రయోజనం జరుగ లేదన్నారు. 
 నీత్ అయోగ్ ద్వారా ఇచ్చిన హామీలు  ఇప్పటివరకు అమలు చేయ లేదని, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేస్తూ, ధనికులకు అప్పజెప్తూ దేశ సంపదను, వేల కోట్ల రూపాయలను దేశంలోని బిజేపేతర రాష్ట్రాలలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలను కూల్చివేస్తున్నారని, అలాంటి కుట్రే తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుందని, అందులో భాగంగా మునుగోడు ఎలక్షన్ వచ్చిందని, వీటన్నింటికీ ద్రోహి అయినా మోడీ రాకను ఎదుర్కొని తీరుతామని, గో బ్యాక్ నినాదంతో అడ్డుకుంటామని ఆయన హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో రేగుంట చంద్రశేఖర్, బొల్లం పూర్ణిమ, దాగం మల్లేష్, బాపు, లక్ష్మీనారాయణ, రాజమొగిలి, శంకర్, రాంచందర్, వెంకటేష్, స్వామి, మహేందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.