శివరాత్రి ఉత్సవాలకు వచ్చిన ఆదాయం16,52,347

Published: Thursday March 18, 2021

మధిర, 17 పాలన ప్రతినిధి : మధిర శివరాత్రి ఉత్సవాల సందర్భంగా హుండీ ఆదాయం మరియు తిరునాళ్లకు సంబంధించిన వివిధ రకాల షాపులు మరియు జాయింట్ వీలు, కొబ్బరి చిప్పలు, లడ్డూ పాటలు బుక్లెట్ సంబంధించిన పాటల ద్వారా మహాశివరాత్రికి వచ్చిన ఆదాయం మొత్తం 1652347 రూపాయలు వచ్చినవి ఈ సందర్భంగా దేవాలయ చైర్మన్ నాగేశ్వరరావు ఈవో సత్యనారాయణ మరియు కమిటీ సభ్యులు పాల్గొని మాట్లాడుతూ కరోనా కు సంబంధించి నియమ నిబంధనలు పాటిస్తూ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలిపారు.శివరాత్రి ఉత్సవాలకు వచ్చిన ఆదాయం వివరాలు  ప్రత్యేక అభిషేకాలు మొత్తం 30 ద్వారా (30 x 2116 రూ).63,480 రూ. మరియు 252 ప్రత్యేక అభిషేకాల ద్వారా 120 రూ చొప్పున మొత్తం 3240 రూ, ప్రత్యేక దర్శనం 20 రూ చొప్పున 4386 మంది భక్తులు దర్శించు ఉన్నారు వీరి ద్వారా మొత్తం 87,720 రూ కొబ్బరి చిప్పలు ప్రోగు చేసుకొనుట ద్వారా 40 వేల ఐదు వందల రూపాయలు, కొబ్బరి కాయలు అమ్ముకొనుట ద్వారా 20000 లడ్డూ ప్రసాదం ద్వారా 25,000, బుక్ లెట్ ద్వారా 75000 రూపాయలు జాయింట్ వీల్ ద్వారా 920000 రూపాయలు దుకాణములు 1,23,850 రూపాయలు శ్రీ స్వామివారి కళ్యాణం 4,548 రూపాయలు, శ్రీ స్వామివారి కళ్యాణ కట్నాలు10,340 రూపాయలు మరియు స్వామి వారి ఉండి ఆదాయం మొత్తం 2,48,669 రూపాయలు చొప్పున శివరాత్రి ఉత్సవాలకు వచ్చిన మొత్తం ఆదాయం 16,52,347 రూపాయిలు ఆదాయం లభించిందని తెలిపారు