పెయింటర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆర్థిక సాయం మధిర నవంబర్4 ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాలిటీ ప

Published: Saturday November 05, 2022

రోడ్డు ప్రమాదాలు కొన్ని కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తాయంటే ఇలాంటి సంఘటనలే ఉదాహరణ ఎంప్లాయిస్ కాలనీ చెందిన వేల్పుల శ్రీనివాస్ పెయింటింగ్ పనిచేస్తూ జీవనాన్ని కొనసాగిస్తున్నారు .గత వారం రోజులు క్రితం ఆటో బైక్ ప్రమాదంలో చేతికి కాలుకు దెబ్బ తగలడంతో వేల్పుల శీను మంచానికి పరిమితం అయ్యారు. కుటుంబ పోషణ భారమైంది దాతల సహకారం కోసం ఎదురుచూస్తున్నాడు. ఈ సందర్భంలో పెయింటర్ శ్యామారావు ఆధ్వర్యంలో పెయింటర్ అసోసియేషన్ వారు ఈరోజు వారి కుటుంబానికి వెళ్లి శ్రీనివాసరావును పరామర్శించి వారి కుటుంబానికి నిత్యవసర సరుకులు కొంత నగలను అందించారు. అదేవిధంగా సిరిపురం గ్రామానికి చెందిన బిల్డింగ్ పెయింటర్ భాస్కర్ ఆధ్వర్యంలో కొంత సహాయం అందినట్లు శ్రీనివాస్ తెలిపారు. అదే విధంగా మరి కొంతమంది దాతలు సహాయం చేసి ఆదుకోవాలని కోరుతున్నారు.