నాసిరకంగా చెక్ డ్యామ్ నిర్మాణ పనులు

Published: Thursday July 22, 2021
మధిర, జులై 21, ప్రజాపాలన ప్రతినిధి : మున్సిపాలిటీమధిర శివాలయం దగ్గర ఆరు కోట్లతో నిర్మిస్తున్న చెక్ డ్యామ్ నిర్మాణం జరుగుతున్న తీరును ఈరోజు సిపిఐ మధిర పట్టణ, మండల కమిటీ నాయకుల బృందం పరిశీలించగా  పూర్తిగా నాణ్యతా ప్రమాణాలకు తిలోదాకాలిచ్చి నాశిరకంగా నిర్మాణ పనులు జరుగుతున్నాయని సిపిఐ పట్టణ కార్యదర్శి బెజవాడ రవి విమర్శించారు. పనులను పర్యవెక్షించాల్సిన అధికారులు కాంట్రాక్టర్ లు ఇచ్చే కమిషన్లకు కక్కుర్తి పడి నాశిరకంగా పనులు జరుగుతున్నా చూసి చూడనట్లు ఉండటం వల్లనే మధిరలో కాంట్రాక్టర్లు వారి ఇష్టారాజ్యంగా వ్యాహరిస్తూ ప్రజా ధనాన్ని లూటీ చేస్తున్నారని విమర్శించారు. చెక్ డ్యాం నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడం వల్ల కంకర తేలి నిర్మాణ పనులు నాశిరకంగా ఉన్నాయని ఆరోపించారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు మామూళ్ళ మత్తునుండి బయటకు వచ్చి నాణ్యతా ప్రమాణాలతో చెక్ డ్యామ్ నిర్మాణం జరిగే విధంగా చూడాలని అధికారులను కోరిన్నారు. అధికారులు స్పందించి నాసిరకంగా ఉన్న పనులను తక్షణమే ఆపివేసి నాణ్యతా ప్రమాణాలతో పనులను దగ్గరుండి జరిపించాలని ఐబీ అధికారులను డిమాండ్ చేసారు. అలాగేజిల్లా అధికారులు కూడా నాశిరకంగా నిర్మిస్తున్న చెక్ డ్యామ్ పనులను చుడాలని బెజవాడ రవి కోరినారు. చెక్ డ్యామ్ పనులను పరిశీలించిన వారిలో సిపిఐ మండల కార్యదర్శి ఊట్ల కొండలరావు, కార్యవర్గ సభ్యులు, అన్నవరపు సత్యనారాయణ, తలారి రమేష్, చెరుకూరి వెంకటేశ్వర రావు పాల్గొన్నారు.