ఇబ్రహీంపట్నం జనవరి తేదీ 23 ప్రజాపాలన ప్రతినిధి *ప్రజావాణి ద్వారా వచ్చిన పిర్యాదులను పరిష్కర

Published: Tuesday January 24, 2023

సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో   వివిధ సమస్యల పై పిర్యాదులను సమర్పించడానికి వచ్చిన ప్రజల నుండి జిల్లా అదనపు కలెక్టర్ తిరుపతి రావు పిర్యాదులను స్వీకరించారు. ఈ రోజు నిర్వహించిన ప్రజావాణి ద్వారా 40 పిర్యాదులు వచ్చాయని తెలిపారు. ప్రజావాణి ద్వారా స్వీకరించిన వివిధ సమస్యలకు సంబంధించిన పిర్యాదులు అన్నింటిని సంబంధిత శాఖలకు పంపించి, వీలైనంత త్వరగా పరిష్కారమయ్యేలా చర్యలు చేపడతామని పిర్యాదుదారులకు తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు,
-