ఎమ్మెల్యేను సన్మానించిన సర్పంచ్ తూము శ్రీనివాసరావు..

Published: Monday September 05, 2022
తల్లాడ, సెప్టెంబర్ 4 (ప్రజాపాలన న్యూస్): సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్యను  మండలంలోని నూతనకల్లు గ్రామ సర్పంచ్ తూము శ్రీనివాసరావు సన్మానించారు. వినాయక ఉత్సవాల్లో భాగంగా ఆదివారం  గ్రామంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్, సీతారామాంజనేయ ఆలయ కమిటీ చైర్మన్ తూము శ్రీనివాసరావు ఎమ్మెల్యేను శాలువాలు పూలమాలతో సన్మానించి సత్కరించారు. ఈ కార్యక్రమంలో వైరా ఏఎంసి వైస్ చైర్మన్ ధూపాటి భద్రరాజు, నాయకులు మువ్వ మురళి, నాయుడు శ్రీనివాసరావు, కేతినేని చలపతిరావు, మైనుద్దీన్, లాలు సాహెబ్, గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.