పినపాక నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీ కి షాక్. మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీల

Published: Tuesday December 20, 2022
పినపాక నియోజకవర్గనికి చెందిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు మంత్రి కేటీఆర్ సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరిక గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానం
ఈరోజు హైదరాబాద్ ప్రగతి భవన్ లో : బిఆర్ఎస్  పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ & ఐటీ పురపాలక శాఖ మంత్రివర్యులు శ్రీ కల్వకుంట్ల తారక రామారావు  సమక్షంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ & పినపాక శాసనసభ్యులు & భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ జిల్లా  ల అధ్యక్షుడు శ్రీ రేగా కాంతారావు  ఆధ్వర్యంలో పినపాక నియోజకవర్గనికి చెందిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు అక్కిరెడ్డి సంజీవరెడ్డి, వారితోపాటు కరకగూడెం సర్పంచ్ ఊకే రామనాథం, మదర్ సాహెబ్, సోమరాజు,కుడితిపుడి కోటేశ్వరరావు, బూర నర్సయ్య,గోగ్గలి నరసయ్య, సుబ్బారావు, నిమ్మ లింగారెడ్డి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, ఆ పార్టీకి రాజీనామా చేసి బిఆర్ఎస్ పార్టీలో చేరారు వారికి వారందరికీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ & మంత్రి కేటీఆర్  గులాబీ కండవా కప్పి పార్టీలోకి స్వాగతం ఆహ్వానించి శుభాకాంక్షలు తెలియజేశారు
ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ శ్రీ రేగా కాంతారావు  మాట్లాడుతూ
రాష్ట్రానికి దేశానికి ఎప్పటికైనా సీఎం కేసీఆర్  పాలనే శ్రీరామరక్ష అని అన్నారు, సీఎం కేసీఆర్  నాయకత్వంలోని బిఆర్ఎస్  ప్రభుత్వంతోనే తెలంగాణ రాష్ట్ర సమగ్ర అభివృద్ధి సహకారమవు అవుతున్నదని అన్నారు, దేశంలోనే అత్యంత  ప్రతిభావంతుడైన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్  నాయకత్వంలో ఐటీ పరిశ్రమలు మున్సిపాలిటీ తదితర శాఖలలో సరికొత్త సంస్కరణలతో పాటు దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలుస్తున్నదని అన్నారు, నేడు అన్ని రంగాలలో తెలంగాణ దేశానికే రోల్ మడల్ అని తెలిపారు, ప్రపంచంలోనే భారత్ ను రోల్డ్ మోడల్ గా నిలిపే సత్తా సీఎం కేసీఆర్ కే ఉన్నదని దేశ ప్రజలు ధీమా వ్యక్తం చేస్తున్నారని అన్నారు, రాష్ట్రంలోని రైతంగానికి నిరంతరం నాణ్యమైన విద్యుత్తును 12,000 కోట్లతో ఉచితంగా అందిస్తున్నారని అందుబాటులో ఉన్న వనరులతో దేశం మొత్తం ఉచిత విద్యుత్తు అందిస్తూ వస్తున్నామన్నారు