షాబాద్ అభివృద్ధికి 11 కోట్ల 70 లక్షల నిధులు మంజూరు:జెడ్పిటిసి పట్నం అవినాష్ రెడ్డి*

Published: Thursday February 02, 2023
 *ప్రజాపాలన షాబాద్ :==షాబాద్ మండలంలో   పలు పథకాల కింద అభివృద్ధి పనులకు కొత్తగా రూ
11 కోట్ల 70 లక్షల నిధులు మంజూరైనట్లు 
జెడ్పిటిసి పట్నం అవినాష్ రెడ్డి తెలిపారు
బుధవారం షాబాద్ మండల కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో పలువురు సర్పంచులు, నాయకులతో కలిసి విలేకరులతో మాట్లాడారు ఈ  సందర్భంగా ఆయన మాట్లాడుతూ జడ్పీ చైర్పర్సన్ అనిత రెడ్డి, ఎంపీ డా. గడ్డం రంజిత్ రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, ఎమ్మెల్సీ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి తదితరుల సహకారంతో మండలంలోని అభివృద్ధి కార్యక్రమాలకు కొత్తగా ఈ నిధులు మంజూరైనట్లు తెలిపారు అంతర్గత సీసీ రోడ్లు, మురుగు కాల్వలు, ప్రహరీ గోడల నిర్మాణాలు, అత్యవసర పనుల కోసం ఈ నిధులను ఎన్ఆర్ఈజీఎస్, హెచ్ఎండిఏ, సీఎం ప్రత్యేక నిధులు, ఎమ్మెల్యే ప్రత్యేక నిధులు, జిల్లా పరిషత్ నిధుల రూపంలో అందాయన్నారు. మండలంలోని 41 గ్రామపంచాయతీల పరిధిలోని 61 హ్యాబిటేషన్ లన్నింటికీ నిధులను అందేట్లుగా చూసామని వివరించారు. ఇందులో భాగంగా ప్రస్తుతం రూ.5 కోట్ల 15 లక్షల ఎన్ఆర్ఈజీఎస్ నిధులు, 2 కోట్ల సీఎం ప్రత్యేక నిధులు, రూ.3 కోట్ల నిధులు, మరో రూ. 70 లక్షల ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి ప్రత్యేక నిధులను అభివృద్ధి కార్యక్రమాలకు అందించడం జరుగుతుందని వెల్లడించారు. సర్పంచులు, ప్రజా ప్రతినిధులు ఈ నిధులను అభివృద్ధి కార్యక్రమాలకు ఐకేటాయించుకొని సకాలంలో, నాణ్యత  ప్రమాణాల ఆధారంగా పూర్తి చేసుకోవాలని అన్నారు. నిధులు అందించిన తమ నేతలకు ధన్యవాదాలు తెలుపుతూ అందరి సహకారంతో మండలాన్ని జిల్లాకే ఆదర్శవంతంగా షాబాద్ మండలాన్ని అన్ని రంగాలలో తీర్చిదిద్దుతామని అవినాష్ రెడ్డి స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ల నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం తో పాటు రాబోయే రోజుల్లో భారతదేశ అభివృద్ధి జరుగుతుందని అన్నారు.
సర్పంచులు శ్రీరామ్ రెడ్డి, మంగమ్మ, దర్శన్, మండల సీనియర్ నాయకులు జడల రాజేందర్ గౌడ్, జీవన్ రెడ్డి,  రాందేవ్ యాదవ్, బలవంత్ రెడ్డి,శ్రీనివాస్, సంకేపల్లిగూడ, పోలారం ఉప సర్పంచ్ రాజేందర్ రెడ్డి, బల్వంత్ రెడ్డి 
తదితరులు పాల్గొన్నారు