త్వరితగతిన సర్వే చేపట్టాలి

Published: Tuesday October 12, 2021
ఇబ్రహీంపట్నం, అక్టోబర్ 11, ప్రజాపాలన ప్రతినిధి : అబ్దుల్లాపూర్మెట్ మండల పరిధిలో కుత్బుల్లాపూర్ గ్రామంలో సర్వే నెంబరు 118 లో ప్రభుత్వ భూమిని సర్వే చేసిన తర్వాత కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుల నుండి బయటికి తీయడం లేదని గ్రామపంచాయతీ సర్వసభ్య సమావేశాన్ని గ్రామ ప్రజలు అడ్డుకోవడం జరిగింది. రెవెన్యూ అధికారులు వచ్చి అక్రమ కట్టడాలను కూల్చివేయాలని, గ్రామ పంచాయతీ ముందు ధర్నా చేయడం జరిగింది. రెవెన్యూ అధికారులు నాయాబ్ తహసిల్దార్  విచ్చేసి కూల కొడతామని, సమాధానం చెప్పేంతవరకు ఇక్కడి నుండి లేచేది లేదని భీష్మించుకు కూర్చోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి సిపిఎం అబ్దుల్లాపూర్మెట్ మండల కార్యదర్శి ఈ. నరసింహ  హాజరై మాట్లాడుతూ సర్వే చేసి హద్దులు వేసినకాడికి వెంటనే కట్టిన నిర్మాణాలను కూల్చివేయాలని డిమాండ్ చేశారు. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు రెవెన్యూ అధికారులు గ్రామ పెద్దలు కుమ్మక్కై అంత పెద్ద నిర్మాణాలు కడుతున్న పట్టనట్టు ఉన్నారని ఆవేదన వ్యక్తం ఇప్పటికైనా వెంటనే అధికారులు స్పందించి అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలని లేనియెడల ఆందోళన ఉదృతం చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల నాయకులు బి.శంకరయ్య గ్రామ ప్రజలు పాల్గొన్నారు.