మాదిగల సంగ్రామ పాదయాత్రతో మాదిగలలో నూతన ఉత్సాహంమాదిగల అంతిమ లక్ష్యం ఎస్సీ వర్గీకరణ ఎమ్మార్

Published: Tuesday June 21, 2022
మధిర జూన్ 20 ప్రజా పాలన  ప్రతినిధి సోమవారం నాడు ఎమ్మార్పీఎస్ఆధ్వర్యంలోమాదిగల సంగ్రామ పాదయాత్ర మధిరకు రాక మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ  ఆదేశాల మేరకు ఈనెల తిరుమలాయపాలెం ప్రారంభమైన మాదిగల సంగ్రామ పాదయాత్ర 14వ రోజు గా మధిర మండలం సిరిపురం గ్రామానికి చేరుకుంది ఈ మాదిగల సంగ్రామ పాదయాత్రకు సిరిపురం మాదిగ ప్రజలు ఘన స్వాగతం పలికారు అనంతరం ఈ సమావేశాన్ని ఉద్దేశించి ఎమ్మార్పీఎస్ జిల్లా కన్వీనర్ కూరపాటి మాదిగ మాట్లాడుతూ ప్రతి రాజకీయ పార్టీ మాదిగలను మోసం చేసిందని వాటికి చెప్పక తప్పదని హెచ్చరించారు అధికారంలోకి  వచ్చిన బిజెపి వంద రోజుల్లో వర్గీకరణ చేస్తానని మాదిగలను మోసం చేసిన బిజెపి ప్రభుత్వానికి గుణపాఠం తప్పదని హెచ్చరించారు జూన్ 2వ తారీఖున జరుగు సడక్ బంద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వర్గీకరణ తోనే మాదిగలకు భవిష్యత్తు ఉంటుందని తెలియజేశారు. మాదిగ సంగ్రామ పాదయాత్ర బృందం వరంగల్ జిల్లా ఎమ్మార్పీఎస్ నాయకులు శాంతి సాగర్ మాదిగ నేలకొండపల్లి ఎమ్మార్పీఎస్ నాయకులు తోలు సురేష్ మాదిగ, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలక నాగరాజు మాదిగ, ఎం ఎస్ ఎఫ్ మధిర మండల నాయకులు వేల్పుల పవన్ కళ్యాణ్ మాదిగ, కనక పూడి శ్రీను మాదిగ దేవదాస్ మాదిగ ఆశీర్వాదం మాదిగ వెంకన్న మాదిగ తదితరులు పాల్గొన్నారు.
 
 
 
Attachments area