పత్తి అధిక మొక్కల సాంద్రత పెరగాలి

Published: Thursday May 19, 2022
జిల్లా వ్యవసాయ అధికారి గోపాల్ 
వికారాబాద్ బ్యూరో 18 మే ప్రజాపాలన :
పత్తి అధిక మొక్కల సాంద్రత విధానం ద్వారా ఓకేసారి ప్రత్తిని తీసేందుకు దోహద పడుతుందని జిల్లా వ్యవసాయ అధికారి గోపాల్ తెలిపారు. బుధవారం కలెక్టరేటులోని సమావేశమందిరంలో   ప్రత్తి అధిక మొక్కల సాంద్రత విధానం పై ఎడిఎ లు, మండల వ్యవసాయ అధికారులు , విస్తరణాధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.  ఈ సందర్బంగా  జిల్లా వ్యవసాయ అధికారి గోపాల్ మాట్లాడుతూ  ప్రత్తి అధిక మొక్కల సాంద్రత విధానం ద్వారా  ఓకేసారి ప్రత్తిని తీయడానికి అనుకూలమే కాకుండా  పంట సాగు 130 నుండి 140  రోజులలోనే  పంట చేతికి వస్తుందని అన్నారు.   అధిక మొక్కల సాంద్రత విధానం ద్వారా రెండవ పంటను వేసుకునేందుకు కూడా అవకాశం ఉంటుందని తెలిపారు.  ఆర్.సి.హెచ్  665 బిజీ-II రకం  వంగడం  ద్వారా అధిక మొక్కల సాంద్రతతో పాటు అధిక దిగుబడి కూడా వస్తుందని అయన తెలిపారు.  జూన్ నుండి జూలై మొదటి వారంలోపల వంగడాలను విత్తుకోవాలన్నారు.  ఈ విత్తనాలు నాటేందుకు తేలికపాటి భూములు అనుకూలంగా వుంటాయని తెలిపారు.   ఎకరాకు సుమారు 26 వేల మొక్కలు వస్తాయని అన్నారు.   జిల్లాలో ఈ విధానం  ద్వారా 500 ఎకరాలు సాగుచేయుటకు లక్ష్యంగా నిర్ణయించడం జరిగిందన్నారు. జిల్లాలో సాగు చేసే క్రమంలో రాశీ సీడ్స్ వారు పూర్తి సహకారం అందించేందుకు ముందుకు రావడం జరిగిందని డిఏవో తెలిపారు. ప్రత్తి అధిక మొక్కల సాంద్రత సాగు  విధానపై   రాశీ సీడ్స్ ఆల్ ఇండియా కోఆర్డినేటర్ నవీన్ కుమార్ గౌడ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎడిఎ లు స్వరూప రాణి, రమాదేవి, డివిజన్, మండల స్థాయి అధికారులు, విస్తరణాధికారులు,  రాశీ సీడ్స్ ప్రతినిధి నగేష్ పాల్గొన్నారు.