భవన నిర్మాణ కార్మికుల రోజువారి వేతనం పెంచాలి మండల భవన నిర్మాణ కార్మికుల డిమాండ్

Published: Monday January 23, 2023

బోనకల్, జనవరి 21 ప్రజాపాలన ప్రతినిధి: మండల భవన నిర్మాణ కార్మికులకు వేతనం పెంచాలంటూ మండల భవన నిర్మాణ కార్మికులు గత రెండు రోజులుగా సమ్మె నిర్వహిస్తూ శనివారం మండల కేంద్రంలో ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో నిత్యవసర వస్తువుల ధరలు అధికంగా పెరిగి చేసే కూలి పని వేతనం సరిపోక నానా ఇబ్బందులు పడుతున్నామని, కావున మండల భవన నిర్మాణ కార్మికుల రోజువారి వేతనం పెంచాలంటూ రెండు రోజులుగా సమ్మెను నిర్వహిస్తూ ర్యాలీగా బయలుదేరి భవన నిర్మాణ కార్మికుల సమస్యలు తీర్చాలని, సిఐటియు జిందాబాద్ , భవన నిర్మాణ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి అంటూ నినాదాలు ఇస్తూ ర్యాలీ నిర్వహించారు. కావున మండల భవన నిర్మాణ కార్మికులు సమ్మెలో పాల్గొని జయప్రదం చేయాలని, ఈ యొక్క సమస్య మండలంలోని ప్రతి ఒక్క భవన నిర్మాణ కార్మికుడి సమస్య అని కావున ఈ సమ్మెలో మండల భవన నిర్మాణ కార్మికులు అందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల భవన నిర్మాణ కార్మికులు పటాన్ చిన్న సైదా, మల్లెల కృష్ణ, మోర్ల లక్ష్మణ, పటాన్ పెద్ద సైదా, మురళి, గద్దల శ్రీను, నునావత్ శ్రీను, బాదావత్ శ్రీను, గడ్డం సత్యం, రాము, పుల్లారావు, నాగుల్ మీరా, నాగ, షేక్ గౌషా, మహిళా కార్మికులు లక్ష్మి, రుక్మిణి, పద్మ, పుల్లమ్మ, సునీత తదితరులు పాల్గొన్నారు.