మండలంలో ముమ్మరంగా జ్వరాల సర్వే: ఎంపీడీఓ డాక్టర్స్ అధికారులు

Published: Saturday May 08, 2021
మధిర, మే 7, ప్రజాపాలన ప్రతినిధి : మధిర మండలం గ్రామపంచాయతీ లోఈ రోజు జిల్లా కలెక్టర్ గారి ఆదేశాలు మేరకు  మరియు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ జిల్లా పంచాయతీ శాఖ సమన్వయ ము తో మధిర మండలం ఎంపీడీఓ విజయభాస్కరరెడ్డి. Phc వైద్యులు మాటూరుపేట dr వెంకటేష్. Dr పుష్పలత. సంయుక్త  ఆధ్వర్యము లో మండలం లొని అన్ని గ్రామాల్లో పంచాయతీరాజ్ శాఖ ఆరోగ్య సిబ్బంది, స్వయం సహాయక సంఘం మరియు అంగన్వాడీ సిబ్బంది  సహకారం తో ఇంటింటా కోవిడ్ అనుమానిత కేసుల గుర్తింపు మరియు ఐసొలేషన్ కిట్ల పంపిణి కార్యక్రమం, జ్వరం పరీక్షలు చేసి తగిన సలహాలు సూచనలు, కోవిడ్ చికిత్స మందుల కిట్లు అవసరమైన వారికి ఇస్తూ బృందాల వారీగా ఒక్కొక్క బృందం 250ఇళ్ళు చొప్పున ఇంటింటా సర్వే కార్యక్రమం చేపట్టారు. ఈ టీమ్ లను ఎంపీడీఓ విజయ్ భాస్కర్ రెడ్డి, EORD రాజారావు, CHO సుభాషిణి, ఆరోగ్య పర్యవేక్షకులు ఊటుకూరి భాస్కర్ రావు, మరియా రాణి, లంకా కొండయ్య, కాంత లీల తదితరుల పర్యవేక్షణలో సర్వే  కార్యక్రమం  చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమం లో గ్రామ సర్పంచులు, ఎంపీటీసీ లు సర్వే కి చేయూతనిచ్చి కోవిడ్ కేసులు పెరగకుండా అప్రమంత్తమ్ గా ఉండాలని పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టాలని అధికారులు సూచించారు