వన్యప్రాణులను రక్షించడమే లక్ష్యం * జిల్లా అటవీ శాఖ అధికారి వెంకటేశ్వర్ రెడ్డి

Published: Thursday September 29, 2022
వికారాబాద్ బ్యూరో 28 సెప్టెంబర్ ప్రజాపాలన : 
 
వికారాబాద్ లోని అనంతగిరి ఫారెస్టులో వన్యప్రాణుల రక్షణ కోసం కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా అటవీ శాఖ అధికారి వెంకటేశ్వర్ రెడ్డి తెలిపారు. బుధవారం జిల్లా అటవీశాఖ అధికారి ప్రజాపాలన బ్యూరో రిపోర్టర్ తో మాట్లాడుతూ అనంతగిరి అటవీ ప్రాంతం విస్తీర్ణం ఎక్కువగా ఉన్నదని తెలిపారు. వన్నె మృగాలను రక్షించుటకు అటవీ ప్రాంతం చుట్టూ కంచి వేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. అటవీ ప్రాంతము చుట్టూ కంచె  పూర్తిగా లేనందువలన జింకలు కుక్కల దాడిలో మృతి చెందుతున్నాయని,వాటిని రక్షించేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు.కుక్కలు అనంతగిరిలో స్వైరవిహారం చేస్తున్నాయని వాటిని నివారియించేందుకు మున్సిపల్ కమిషనర్ కు పలు మార్లు పిర్యాదు చేసిన లాభం లేకుండా పోయిందని,కుక్కుల దాడిలో మృతి చెందుతునట్లు సూచించారు.అనంతగిరి ఫారెస్ట్ దగ్గరలో ఉన్న  రిసార్ట్ లో డీజే లు పెట్టారాదని,భారీ శబ్దాలు వల్ల వన్యప్రాణులు అడవిని వదిలి రోడ్ల పైకి వస్తున్నట్లు తెలుస్తుందని,డిజే లు పెట్టకుండా చర్యలు తీసుకుంటామన్నారు.అనంతగిరి చుట్టూ మొత్తం మూళ్ళ కంచె పూర్తి అయితే జీవులకు రక్షణ ఉంటుందని అన్నారు.శని,ఆదివారాల్లో పెట్రోలింగ్ పెంచి,అసాంఘిక కార్యక్రమలు జరుగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని అన్నారు.అనంతగిరి ఫారెస్ట్ ఏరియాలో వాహనదారులు నిదానంగా వాహనాలను నడపాలని కోరారు.