స్త్రీలను గౌరవించడం మన సాంప్రదాయం

Published: Tuesday March 09, 2021
వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్
వికారాబాద్ జిల్లా మార్చి 08 ( ప్రజా పాలన ప్రతినిధి ) : పంచాయతీ ఎన్నికలలో మహిళల కోసం 50% రిజర్వేషన్ కల్పించిందని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. సోమవారం మున్సిపల్ కార్యాలయంలోని గాంధీ పార్క్ లో 107వ అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్ పర్సన్ చిగుళ్ళపల్లి మంజుల అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ మాజీ ఎమ్మెల్యే చింత ప్రభాకర్  జహంగీర్ పాష హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం మహిళా దినోత్సవం సందర్భాన్ని పురస్కరించుకొని మహిళా ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా సెలవు దినంగా  ప్రకటించడం విశేషమని కొనియాడారు. మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. మహిళల భద్రత కోసం మన ప్రభుత్వం షీ టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఆడపిల్ల పెళ్ళి కోసం కళ్యాణ లక్ష్మీ షాది ముబారక్ పథకం అమలు చేస్తుందన్నారు. ప్రసవం సమయంలో ఆర్థిక సహాయంతో పాటు కెసిఆర్ కిట్ అందిస్తుందన్నారు. మున్సిపల్ చైర్ పర్సన్ మాట్లాడుతూ.. యత్ర నార్యంతు పూజ్యతే రమంతే తత్ర దేవతాః అనగా ఎక్కడైతే స్త్రీలు గౌరవింపసడతారో అక్కడ దేవతలు నివశిస్తారు. ఆడపిల్ల అబల కాదు సబల అని పలు సందర్భాల్లో నిరూపించారని గుర్తు చేశారు. నారీమణులు తలుచుకుంటే సాధ్యం కానిదేదీ ఉండదని విశ్వాసం వ్యక్తం చేశారు. అందుకు నేనే ఉదాహరణ అని గుర్తు చేశారు. నేను ధైర్యంగా రాజకీయాల్లోకి రావాలనుకున్నాను వచ్చాను గెలిచాను. అనంతరం మహిళా కౌన్సిలర్లను, మున్సిపల్ సిబ్బందిని సన్మానించడం, పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పిఏసిఎస్ చైర్మన్ ముత్యం రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ శంషాద్ బేగం, పట్టణ మహిళా సమాఖ్య అధ్యక్షురాలు రత్నమ్మ, పట్టణ అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ ముత్తాహర్ షరీఫ్, కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం : 
ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా వికారాబాద్ నియోజకవర్గం మోమిన్ పేట్ మండలం మేకవనంపల్లి గ్రామంలోని హరితవనంలో ఏర్పాటు చేసిన పట్టభద్రుల ఆత్మీయుల సమ్మేళన సభలో పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికలకు సంబంధించి టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎస్ వాణి దేవిని గెలిపించాలని కోరారు. వారందరూ అందుకు సానుకూలంగా స్పందించారు. అనంతరం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సదర్భంగా మహిళలకు శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో టిఎస్పిఎస్సీ మాజీ సభ్యులు విఠల్, జడ్పి వైస్ చైర్మన్ విజయ్ కుమార్, డిసిఎంఎస్ మాజీ చైర్మన్ నర్సింలు గుప్త, ఎంపిపి వసంత, పిఏసిఎస్ చైర్మన్లు అంజి రెడ్డి  విష్ణువర్ధన్ రెడ్డి, పార్టీ అధ్యక్షులు నర్సింహ రెడ్డి, రైతు బంధు అధ్యక్షులు విఠల్, సర్పంచుల సంఘం అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, వైస్ ఎంపిపి మానస, ఎంపిటిసిల ఫోరం అధ్యక్షులు డాకూరి శ్రీనివాస్ రెడ్డి, పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.