గాలిలొ మేడలు గా మన ఊరు మన బడి . .... ఎంపీడీఓ, జెఈ, ఏఈలపై చర్యలకు సిపిఎం డిమాండ్.

Published: Monday December 26, 2022
బెల్లంపల్లి డిసెంబర్ 25 ప్రజా పాలన ప్రతినిధి:  మంచిర్యాల జిల్లా
కాసిపేట  మండల కేంద్రంలో ఉన్న అప్పర్ ప్రైమరీ పాఠశాలలో ఏర్పాటు చేసిన "మన ఊరు మన బడి"కార్యక్రమంలో భాగంగా చేపడుతున్న, గదులు,  చుట్టూ ప్రహరీ గోడ నిర్మాణం, కోసం ప్రభుత్వం లక్షలాది రూపాయలు నిధులు మంజూరు చేసిందని, కానీ కాంట్రాక్టర్ లాభం కోసం అధికారుల నిర్లక్ష్యం వల్ల నాసిరకమైన పనులు నిబంధనలకు విరుద్ధంగా చేస్తున్నారనీ, సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి సంకె రవి, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యురాలు దాసరి రాజేశ్వరీలు అన్నారు.
 
ఆదివారం పనులు జరుగుతున్న ప్రదేశాన్ని వారు పరిశీలించి అనంతరం మాట్లాడారూ,
ఇప్పటివరకు జరిగిన పనులు పూర్తిగా నాసిరకంగా,నాణ్యత లేకుండా నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని,  కనీసం నాలుగు ఫీట్ల లోతు నుంచి ఫిల్లర్లు వేయాల్సి ఉండగా,  కేవలం ఫీట్న్నార లోతుతోనే పిల్లర్లు వేశారనీ, నాణ్యమైన ఇసుక కాకుండా, స్థానిక వాగులో దొరికే గల్ల ఇసుక,ఎర్రటి రంగుతో ఉన్న ఇసుకతో నిర్మాణాలు చేపట్టడం జరుగుతుందనీ, ఇంత జరుగుతున్న ప్రభుత్వ అధికారులైన ఎంపీడీవోలు, జెఈ, ఏఈ,లు   పనులను పర్యవేక్షణ చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనీ,ఇదే అలుసుగా భావించిన కాంట్రాక్టర్ నాసిరకమైన పనులు చేపడుతూ ప్రజాధనాన్ని కాజేయడం జరుగుతుందనీ అన్నారు. ఇప్పటికైనా జరుగుతున్న పనులపై జిల్లా అధికారులు వెంటనే జోక్యం చేసుకొని జరిగిన పనులను పరిశీలన చేసి నాసిరకంగ జరిగిన పనులను రద్దుచేసి నిబంధనలకు అనుగుణంగా పనులు జరిపించాలని, బాధ్యులైన కాంట్రాక్టర్ పై, నిర్లక్ష్యంగా ఉన్న ఎంపీడీవో, ఏఈ, జేఈల, పై  చర్యలు తీసుకొని, ప్రజాధనాన్ని దుర్వినియోగం కాకుండా చూడాలని జిల్లా ఉన్నతాధికారులను వారు కోరారు.