అర్హులైన వారందరికీ డబుల్ బెడ్ రూం ఇండ్లు పంపిణీ ఎప్పుడో..?

Published: Friday August 27, 2021
ఇబ్రహీంపట్నం, ఆగస్టు 26 ప్రజాపాలన ప్రతినిధి : అర్హులైన పేదలందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పంపిణీ చేయాలని వైయస్సార్తెలంగాణ పార్టీ రాష్ట్ర నాయకుడు మాదగోని జంగయ్య గౌడ్ మంచాల మండల నాయకుడు నేనవత్ శ్రీనివాస్ నాయక్ అన్నారు. లింగంపల్లి గెట్ వద్ద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన ప్రారంభానికి నోచుకోని డబల్ బెడ్ రూం ఇండ్లను పరిశీలించారు ఈ సందర్భంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మాద గోని జంగయ్య గౌడ్ వైయస్సార్ తెలంగాణ పార్టీ సీనియర్ నాయకుడు ఉడుగుల భాస్కర్ గౌడ్ కలిసి మాట్లాడుతూ లింగం పల్లి గెట్ వద్ద నిరుపేదల కోసం డబుల్ బెడ్ రూం ఇండ్లు నిర్మాణం మొదలు పెట్టి సుమారు మూడు ఏండ్లు గడుస్తున్న పనులు పూర్తి అయిన అర్హులైన పేదలకు డబుల్ బెడ్ రూం  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు పంపిణీ చేయటం లేదో అర్థం కావటం లేదు అన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్  తన ప్రాంతం వాళ్లకె డబల్ బెడ్ రూం ఇండ్లు పంపిణీ చేయటం సరైన పద్ధతి కాదు అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలను   అదుకుంటా అని రాష్టంలో పేదరికాన్ని రూపు మాపి బంగారు తెలంగాణ రాష్ట్రంగా తీర్చిదిద్దుతా అన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణ రాష్ట్రని అప్పుల రాష్టంగా మార్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ దకిందని అన్నారు రాష్ట్రంలోఎక్కడ ఉప ఎన్నికల వచ్చిన కొత్త కొత్త హమిలు గుర్తిస్తూ ఎన్నికల వాగ్దానంలో ప్రజలకు ఇచ్చిన హమిలను మార్చి పోయి ప్రజలను  కేసీఆర్ మోసం చేస్తున్నాడు అన్నారు. వెంటనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పందించి నిర్మాణం పూర్తి అయిన డబల్ బెడ్ రూం ఇండ్లను అర్హులైన పేదలకు పంపిణీ చేయాలి అలాగే గ్రామాల్లో సొంత స్థలం ఉన్న పేదలకు స్థలం వద్దే ఇండ్లు నిర్మాణం కోసం ఐదు లక్షల రూపాయలు మంజూరు చేయాలని డిమాండ్ చేసారు పక్షంలో వైయస్సార్ తెలంగాణ పార్టీ రాష్ట్ర నాయకురాలు వైయస్ షర్మిల దృష్టికి తీసుకు వెళ్లి డబల్ బెడ్ రూం ఇండ్ల విషయంలో ఇంకా ఆలస్యం జరుగుతే ఉద్యమం వేగవంతం చేస్తాం అని హెచ్చరిస్తున్నాం ఈ కార్యక్రమంలో నాయకులు గోరెంకాల నంద కుమార్, సపవట్ పాండు నాయక్, సపవట్ రామారావు నాయక్, సపవట్ సీతారాం నాయక్, దన్ కోటి, సక్య, తదితరులు పాల్గొన్నారు.