వాసవి క్లబ్ ఆధ్వర్యంలో గవర్నర్ అధికారిక పర్యటన.

Published: Monday January 31, 2022
మంచిర్యాల్ లో పలు సేవా కార్యక్రమాల నిర్వహణ.
మంచిర్యాల బ్యూరో, జనవరి30, ప్రజాపాలన : మంచిర్యాల జిల్లా కేంద్రంలో వాసవి క్లబ్స్ ఆధ్వర్యంలో ఆదివారం వాసవి క్లబ్ జిల్లా గవర్నర్ బాల సంతోష్ అధికారిక పర్యటనలో భాగంగా పలురకాల సేవా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా వైశ్య సంఘం కురుక్షేత్రంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించి, పరిసరాలను పరిశుభ్రం పరిచారు. అనంతరం గాంధీ పార్క్ లోని మహాత్ముని విగ్రహానికి పూలమాలలు సమర్పించి ఘనంగా నివాళులు అర్పించారు. అలాగే వాటర్ ట్యాంక్ చౌరస్తాలోని పొట్టిశ్రీరాములు విగ్రహం వద్ద నూతనంగా చిలువేరు వైకుంఠం సహకారంతో నిర్మించిన మెట్లను ప్రారంభించారు. అలాగే కాలేజ్ రోడ్ లోని మానసిక వికలాంగుల పునరావాస కేంద్రం లోని మానసిక వికలాంగులకు నెల రోజులకు సరిపడా నిత్యవసర వస్తువులను పంపిణీ చేశారు. అనంతరం గోశాలలో గోవులకు గ్రాసం, సున్నిపిండిని అందజేసి తులసి మొక్కలను నాటారు. ఈ సందర్భంగా గవర్నర్ బాల సంతోష్ మాట్లాడుతూ, వాసవి క్లబ్ అంతర్జాతీయస్థాయిలో అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తుందని అన్నారు. గ్రామ స్థాయిలో మండల పట్టణ స్థాయిలో కూడా నిరుపేదలకు వాసవి క్లబ్ ఆధ్వర్యంలో పలు రకాల సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆదుకుంటామని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అనంతరం వాసవి క్లబ్ సభ్యులు నిర్వహించిన సేవా కార్యక్రమాలు రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమాలలో వాసవి క్లబ్ అంతర్జాతీయ ఉపాధ్యక్షులు ముక్తా శ్రీనివాస్, క్యాబినెట్ ప్రధాన కార్యదర్శి బోనగిరి వేణుగోపాల్, కోశాధికారి పుల్లూరి బాల మోహన్, అంతర్జాతీయ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ దొంతుల ముఖేష్, వి కె ఎస్ పి జిల్లా ఇన్చార్జి అప్పాల శ్రీధర్, రిజియన్ చైర్మన్ వుత్తురి రమేష్, జోన్ చైర్మన్ లు కాచం సతీష్, కుంకుముట్టి వెంకటేష్, నాగిశెట్టి జ్యోతి, వాసవిక్లబ్ అధ్యక్షులు కేశెట్టి వంశీకృష్ణ, కార్యదర్శి నలమాసు ప్రవీణ్, కోశాధికారి మల్యాల శ్రీనివాస్, వాసవి వనిత క్లబ్ అధ్యక్షురాలు గౌరిశెట్టి ధనలక్ష్మి, కోశాధికారి కటకం సునీత, వాసవి కపుల్స్ క్లబ్ అధ్యక్షులు గడ్డం రమాదేవి రమేష్, కోశాధికారి బజ్జురి శ్రీనివాస్, వాసవి యూత్ క్లబ్ అధ్యక్షుడు మల్యాల యోగేశ్వర్, కార్యదర్శి అరుణ్, కోశాధికారి బోనగిరి సాయి, ఇందారం వాసవి కపుల్స్ క్లబ్ అధ్యక్షులు చిలువేరు శ్రీనివాస్, మంచిర్యాల వాసవి యువజన సంఘం అధ్యక్షులు కంభంపాటి కమలాకర్ , పడకంటి ప్రవీణ్, ఎర్రం వెంకటేష్, ముత్యాల శ్రీనివాస్, అంచూరి నగేష్, మల్యాల విజయభాస్కర్ లతోపాటు అన్ని క్లబ్బుల సభ్యులు, నాయకులు పాల్గొన్నారు.