బిఆర్ఎస్ గ్రామ కార్యదర్శి పదవికి రాజీనామా

Published: Thursday April 13, 2023
బోనకల్, ఏప్రిల్ 12 ప్రజా పాలన ప్రతినిధి: మండల పరిధిలోని చొప్పకట్లపాలెం గ్రామానికి చెందిన పర్సగాని గోపి బీఆర్ఎస్ గ్రామ కార్యదర్శి పదవికి రాజీనామా చేశారు..ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీనివాసరెడ్డి నీ పార్టీ నుండి సస్పెండ్ చేయడం చాలా బాధాకరం ఉరిశిక్ష పడే ఖైదీ కూడా ఒక అవకాశం ఉంటుంది కానీ మీకు నియంత పాలనకు ఇది ఒక నిదర్శనం ఇక ఎన్నో రోజుల మీ ఆగడాలు సాగవని మీకు మీ నియంత పాలనకు చమర గీతం పాడే రోజులు దగ్గరలో ఉన్నాయని హెచ్చరిస్తూ అమరుల త్యాగాల మీద ఏర్పడ్డ తెలంగాణ ఆశయాల కోసం కృషి చేస్తూ ఈ కుటుంబాలను నియంత పాలన గద్ద దింపే వరకు పోరాడతామని హెచ్చరిస్తూ మీకు మీ పార్టీ సభ్యత్వం కు గ్రామ కార్యదర్శి పదవికి రాజీనామా చేస్తున్నట్టులు ఆయన అన్నారు.