ఇబ్రహీంపట్నం నవంబర్ తేదీ 2ప్రజాపాలన ప్రతినిధి *లింగం పల్లి గెట్ వద్ద నిర్మాణం పూర్తి అయిన డబ

Published: Thursday November 03, 2022

మంచాల మండలం లింగం పల్లి గెట్ వద్ద ఇండ్లు లేని నిరుపేద ల కోసం నిర్మించిన డబల్ బెడ్ రూం ఇండ్లను వెంటనే అర్హులైన పేదలకు పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మంచాల మండలం అధ్యక్షుడు నేనవత్ శ్రీనివాస్ నాయక్ ఆధ్వర్యంలో మంచాలం మండలం ఈఓర్డ్  అధికారి తేజ్ సింగ్ కు వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమనికి ముఖ్యఅధితిగా హాజరు అయిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు మాదగోని జంగయ్య గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇండ్లు లేని నిరుపేదల కోసం లింగం పల్లి గెట్ వద్ద డబల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణం మొదలు పెట్టి ఐదు ఏండ్లు అయ్యిది.నిర్మాణం పూర్తిఅయి మూడు ఏండ్లు గడుస్తున్నా పేద ప్రజలకు డబల్ బెడ్ రూం ఏండ్లు పంపిణీ చేయటానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు నిర్లక్యం చేస్తుందో అర్థం కావటం లేదు అన్నారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పలు సందర్భాల్లో మీడియాలో మాట్లాడుతూ పేద ప్రజలకు కోసం డబల్ బెడ్ రూం ఇండ్లు పంపిణీ చేసాం అని అబద్ధపు మాటలు చెప్పుతూ తెలంగాణ రాష్ట్ర ప్రజలను మభ్య పెట్టటం తప్ప రంగారెడ్డి జిల్లాలో ఏ ఒక్క పేద వాడికి డబల్ బెడ్ రూం ఇల్లు పంపిణీ చేయలేదు అన్నారు స్వర్గీయ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి పాలనలో రాజీవ్ గృహ కల్ప పేరుతో ఇండ్లు నిర్మిచి అర్హులైన ఇండ్లు లేని ప్రతి పేద వాడికి ఇండ్లు పంపిణీ చేసిన గొప్ప నాయకుడు వైయస్ రాజశేఖర రెడ్డి గారు సొంత స్థలం ఉన్న వారికి ఇందిరమ్మ ఇండ్ల పేరుతో నిధులు మంజూరు చేసి పేద వాడి సొంత ఇంటి కల నెరవేర్చిన గొప్ప ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి గారు అన్నారు తెలంగాణ రాష్టం ఏర్పాటు అయితే మన బ్రతుకులు బాగు పడతాయి డబల్ బెడ్ రూం ఇండ్లు నిర్మించి ఇస్తాడు అని ముఖ్యమంత్రి కేసీఆర్ మాటలు విని మోస పోయాం అని ఇండ్లు లేని పేద ప్రజలు ఆందోళన చెందుతున్నారు అన్నారు నిర్మాణం పూర్తి అయ్యి పంపిణీ చేయటానికి సిద్ధంగా ఉన్న డబల్ బెడ్ రూం ఇండ్లు అర్హులైన పేద వాళ్లకు ఎందుకు పంపిణీ చేయటం లేదో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలి వెంటనే ప్రభుత్వం స్పందించి ఇండ్లు లేని అర్హులైన నీరు పేదలకు డబల్ బెడ్ రూం ఇండ్లు పంపిణీ చేయాలి సొంత స్థలం ఉండి ఇల్లు కట్టుకునే స్థోమత లేని పేద ప్రజలకు ఇల్లు నిర్మించు కోవటానికి 5లక్షల రూపాయలు మంజూరు చేసి ఆదుకోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వని డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమం చేస్తాం అని హెచ్చరిస్తున్నాం ఈ కార్యక్రమంలో
1.మంచాల మండలం బిసి సెల్ అధ్యక్షుడు
బూర. జంగయ్య గౌడ్
2.ఇబ్రహీంపట్నం మండలం యువజన విభాగం నాయకుడు
గోరెంకాల నంద కుమార్ ముదిరాజ్
3.మంచాల మండలం యువజన విభాగం అధ్యక్షుడు
ఎన్నుదుల. మహేష్ .సపవట్. పాండు నాయక్
5.జే. శ్రీనివాస్ నాయక్ తదితరులు పాల్గొన్నారు