చెక్ఇడ్యామ్ నిర్మాణం స్థలము వేరే చోటకు మార్చండి

Published: Saturday May 22, 2021
కోదాడ ఎమ్మేల్యే కు పైనంపల్లి ప్రజాప్రతినిధుల వినతి.
పాలేరు, మే 21, (ప్రజాపాలన ప్రతినిధి) : ఖమ్మం-సూర్యాపేట జిల్లాల సరిహద్దు లో నిర్మించనున్న చెక్ డ్యామ్ లోకేషన్ ను మార్చాలని కోదాడ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ ను ప్రజాప్రతినిధులు కోరారు. జిల్లా సరిహద్దు పైనంపల్లి ఏటి బ్రిడ్జి వద్ద ఆనంతగిరి మండలం లోని శాంతినగర్ - నేలకొండపల్లి మండలంలోని పైనంపల్లి గ్రామాల మధ్య వంతెన ఉంది. ఈ ఏటి పై సూర్యాపేట జిల్లా అధికారులు రూ.3.30 కోట్ల తో నూతనంగా చెక్ డ్యామ్ ను నిర్మించనున్నారు. కాగా చెక్ట్యామ్ నిర్మించే స్థలం ను శుక్రవారం కోదాడ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ పరిశీలించారు. ఇరిగేషన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. విషయం తెలుసుకున్న పైనంపల్లి ప్రజాప్రతినిధులు ఎమ్మేల్యే ను కలిసి పరిస్థితిని వివరించారు. చెక్ డ్యామ్ ను నిర్మించనున్న ఈ స్థలం లో నిర్మిస్తే తమ గ్రామంలోని శ్మాసన వాటిక పూర్తిగా మునిగిపోతుందని తెలిపారు.' కావునా లోకేషన్ ను మార్చాలని వినతి పత్రం అందించారు. ఎమ్మెల్యే ను కలిసిన వారిలో డీసీఎంఎస్ డైరెక్టర్ నాగుబండి శ్రీనివాసరావు, సర్పంచ్ కొండ్రు విజయలక్ష్మి, ఎంపీటీసీ ఉసిరికాయల లక్ష్మయ్య, గ్రామ పెద్దలు గడ్డం సత్యం, కొండ్రు క్రాంతి, మారగాని వీరబాబు, తెలగమళ్ల నరేష్ తదితరులు వున్నారు.