ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రభుత్వం ప్రారంభించాలి

Published: Thursday October 28, 2021
యాదాద్రి అక్టోబర్ 27 వలిగొండ ప్రజాపాలన ప్రతినిధి బుధవారం మండల కేంద్రంలోని ఆయన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతులు ఆరుగాలం కష్టించించి పండించిన వరి దాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తరలించి 20 రోజులు గడుస్తున్నా అన్ని పనులు వదిలేసి అక్కడే ఉండవలిసి వస్తుందని, ప్రభుత్వం వెంటనే రైతుల సమస్యలను గమనించి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని ఆయన అన్నారు. ప్రభుత్వం 7 సంవత్సరాలుగా ప్రాజెక్టులు నిర్మించి ప్రతి ఎకరాకు నీరు అందిస్తామని గొప్పలు చెప్పి ప్రస్తుతం వరి పైరుకు బదులు ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని జిల్లా కలెక్టర్లతో చెప్పించడం విడ్డురంగా ఉందని, రైతు పక్షపాతి ప్రభుత్వం అని చెప్పుకునే నాయకులు ప్రస్తుతం రైతులకు న్యాయం చేయాలని అన్నారు. ఎరువుల దుకాణాలలో వరి విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని దుకాణాల లైసెన్స్ లు రద్దుచేస్తామని కలెక్టర్లు బెదిరిస్తున్నారని అది సరైన పద్ధతి కాదని ఆయన అన్నారు. రైతులకు ఎల్లవేళలా కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిపి తుమ్మల నర్సయ్య, పాశం సత్తిరెడ్డి, బొల్ల శ్రీనివాస్, షేక్ రసూల్, కుందారపు కొమురయ్య, బత్తిని లింగయ్య, పాండు, గరిసే రవి, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.