రైతులకు నోటీస్ ఇవ్వకుండా ఆన్ లైన్ నుండి భూమి వివరాలు తొలగించిన రెవెన్యూ అధికారులపై ప్రభుత్

Published: Tuesday November 23, 2021
ఇబ్రహీంపట్నం అక్టోబర్ 22 ప్రజాపాలన ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో గొప్పగా 2017 లో చేపట్టిన భూ రికార్డ్ మొదలు పెట్టి నాలుగు ఏండ్లు గడుస్తున్నా ఇప్పట్టి వరకు తప్పుల తడకగా ఉన్న రైతుల భూముల రికార్డ్ లు సక్రమంగా ఆన్ లైన్ చేయటంలో తహసీల్దార్, అధికారులు పూర్తిగా విఫలం అయ్యారని వైయస్సార్ తెలంగాణ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మాదగోని జంగయ్య గౌడ్ అన్నారు. భూరికార్డ్ సమయంలో విధులు నిర్వహించిన తహసీల్దార్ అధికారులు రైతులకు ఎలాంటి నోటీస్ లు కూడ ఇవ్వకుండా రైతులు కబ్జాలో ఉండి సాగు చేసుకుంటున్న భూముల వివరాలు ఎకరాల కొద్దీ ఆన్ లైన్ రికార్డ్ నుండి తొలగించడం జరుగిందని, మారికార్డ్లు సరి చేయాలని రైతులు నాలుగు ఏండ్ల నుండి తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ అధికారులకు ఎన్నో దరఖాస్తులు పెట్టుకున్న ఆన్ లైన్ లో దరఖాస్తులు చేసుకున్నా ఇప్పట్టి వరకు భూ రికార్డ్ లు సక్రమంగా చేయలేదని అన్నారు. ఈ విషయం పై తహసీల్దార్ కార్యాలయం అధికారులను నిలదీస్తే మాకు ధరణి లో ఇంకా ఆన్ లైన్ అప్షన్ రాలేదను పొంతనలేని సమాధానం చెబుతున్నారని అన్నారు. డబ్బు ఉన్న బడా బాబులకు అన్ని ఆన్ లైన్లు పని చేస్తాయి. లేని వాడు తహసీల్దార్ కార్యాలయం చుట్టూ ఏండ్ల కొద్దీ తిరిగినా రికార్డ్ ఆన్ లైన్ సక్రమంగా చేయరు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీరు మారాలన్నారు. ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పందించి భూ రికార్డ్ సమయంలో రైతులకు ఎలాంటి నోటీస్ లు ఇవ్వకుండా రికార్డ్ లో నుండి ఎకరాల కొద్దీ భూములు ఆన్ లైన్ రికార్డ్ లొ నుండి తొలగించి రికార్డ్ లు తప్పుల తడకగా మార్చిన అప్పట్టి తహసీల్దార్ అధికారులపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కఠిన మైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వని డిమాండ్ చేశారు. లేని పక్షలో రైతులతో కలిసి తహసీల్దార్ కార్యాలయాలను ముట్టడిస్తాం అని హెచ్చరించారు.