మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ వై.యాస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు

Published: Friday July 09, 2021
జగిత్యాల, జులై 08 (ప్రజాపాలన ప్రతినిధి) : జగిత్యాల పట్టణంలోనీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ టి. జీవన్ రెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన దివంగత మాజీ ముఖ్యమంత్రి డా.వై.యెస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలను జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అయన చిత్రపటానికి పూలమాలలువేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ వైఎస్సార్ సేవలు వారి పాలన సంక్షేమానికి అభివృద్ధికి స్వర్ణయుగం నేటి తెలుగు రాష్ట్రాల ప్రాజెక్టులకు ఆద్యుడు సాగు తాగు నీటి ప్రాజెక్టులకు అంకురార్పణ చేసిన అపర భగీరథుడు అని తెలుగు రాష్ట్రాల ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన జన నేత డా: వై.యెస్ రాజశేఖర్ రెడ్డి అని భారత దేశ చరిత్ర పుటల్లో నిలిచే విధంగా ఏకకాలంలో రైతులకు రుణమాఫీ చేసి ఉచిత విద్యుత్ ఫీజ్ రీయింబస్సెమెంట్ 108,104 సేవలు ఆరోగ్యశ్రీ లాంటి సంక్షేమ పథకాలతో సంక్షేమానికి బాటలువేసి ప్రపంచ వ్యాప్తంగా యావత్ తెలుగు ప్రజలకు గుర్తింపు లభించే విధంగా కృషి చేసిన మహనీయుడు డా.వైయెస్ రాజశేఖర రెడ్డి అని పేర్కొన్నారు. ఆయన సేవలను గౌరవిస్తూ కేంద్రప్రభుత్వం బాధ్యతగా  భారతరత్న బిరుదు ఇవ్వాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ బండ శంకర్ గిరి నాగభూషణం నక్క జీవన్ కల్లేపల్లి దుర్గయ్య కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.