ఈటెలకు మద్దతుగా నిరసన గళం

Published: Tuesday May 04, 2021
మల్లాపూర్ ముదిరాజ్ మహాసభ యువజన విభాగం
మల్లాపూర్, ఏప్రిల్ 03 (ప్రజాపాలన ప్రతినిధి) : మంత్రి ఈటెల రాజేందర్‌ను ఉద్దేశపూర్వకంగా అప్రతిష్ట పాలుచేయడానికి సీఎం కేసీఆర్‌ కుట్ర పన్నారని ఆరోపిస్తూ మల్లాపూర్ ముదిరాజ్ మహాసభ యువజన విభాగం సోమవారం మల్లాపూర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఆరోపిస్తూ నిరసన తెలిపారు. వారు మాట్లాడుతూ ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు, ఉద్యమ సమయంలో ఉద్యమాన్ని ముందుకు నడిపిన ఉద్యమ కారునిగా, బడుగు బలహీనవర్గాల ప్రజలకు చేరువలో ఉంటూ 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్‌ను రాష్ట్ర మంత్రివర్గం నుంచి తొలగించి, బర్తురఫ్ చేయడం చాలా బాధాకరంగా ఉందని అంటూ. తెలంగాణ రాష్ట్రంలో కరోనా ఉదృతంగా వ్యాప్తి చెందుతున్న సమయంలో ప్రజలు కరోనాను ఆరోగ్యశ్రీ లో చేరుస్తారని ఆశాగా ప్రజలు చూస్తున్నారు. ఈ కోవిడ్ సమయంలో కూడా తన ఆరోగ్యం లెక్కచేయక ప్రజలకి అందుబాటులో ఉంటూ ఆరోగ్య శాఖ మంత్రిగా తన కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నా ఈటెల రాజేందర్ ను భూకబ్జా అభియోగాలతో కేసీఆర్ తొలగించటం సరైన నిర్ణయం కాదని దీనిని ఖండిస్తూ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఈటెల కి మద్దతుగా మల్లాపూర్ ముదిరాజ్ మహాసభ యువజన విభాగం నిరసన తెలియచేయటం జరిగింది.