ఎంజిఎన్ఆర్ఈజిఎస్ అంచనా వ్యయం 60.96 కోట్లు

Published: Saturday April 01, 2023
* పంచాయతీరాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాస్ రెడ్డి
వికారాబాద్ బ్యూరో 31 మార్చి ప్రజాపాలన :  జిల్లాలో 2022-23 ఆర్థిక సంవత్సరంనకు గాను మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ  పథకం కింద రూ. 60.96 కోట్ల  అంచనా వ్యయంతో 717 పనులు మంజూరు చేయడం జరిగిందని పంచాయతీరాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాస్ రెడ్డి ఒక ప్రకటన తెలిపారు.  ఇందులో 715 సీసీ రోడ్లు,  ఒక మెటల్ రోడ్డుతో పాటు ఒక సీసీ డ్రేన్ పనులు ఉన్నాయని ఆయన తెలిపారు. మంజూరైన వాటిలో 652 పనులను రూ. 54. 35 కోట్లతో పనులు పూర్తి చేయడమైనదని తెలిపారు.   మిగతా 65 పనులు వివిధ దశలలో పురోగతిలో ఉన్నాయని,  ఇట్టి పనులను పై అధికారుల అనుమతితో   2023-24 ఆర్థిక సంవత్సరంలో చేపట్టడం  జరుగుతుందని ఇఇ ఆ   ప్రకటనలో తెలియజేసినారు.