లూయీ బ్రెయిలీ జన్మదిన వేడుకలు

Published: Thursday January 05, 2023
 జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిణి కేతావత్ లలిత కుమారి
వికారాబాద్ బ్యూరో 04 జనవరి ప్రజా పాలన : లూయీ బ్రెయిలీ 214 వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించామని జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిని కేతావత్ లలితకుమారి అన్నారు. బుధవారం
మహిళా శిశు , దివ్యాంగుల వయోవృద్ధుల శాఖ ఆధ్వర్యంలో లూయీ బ్రెయిలీ 214 వ జన్మదిన వేడుకలు స్థానిక  డిస్ట్రిక్ట్ పంచాయితీ రాజ్ రిసోర్స్ సెంటర్  మద్గుల్ చిట్టెంపల్లి లో  ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా  జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిణి కేతావత్ లలిత కుమారి, జిల్లాకు చెందిన  ఐసిడిఎస్ చైల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్స్ కృష్ణవేణి , ప్రియదర్శిని, జయరాం నాయక్,  వెంకటేశ్వరమ్మ ,  రేణుక , కాంత రావు, డి ఆర్ డి ఎ డి పి ఎం నర్సింలు, దివ్యాంగులు, స్టాప్, హాజరు కావడం జరిగింది.  కార్యక్రమాన్ని ఉద్దేశించి మహిళా శిశు దివ్యాంగుల వయోవృద్ధుల శాఖ అధికారిణి కేతావత్ లలిత కుమారి మాట్లాడుతూ  అంధులకు ప్రభుత్వం తరఫున సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని అన్నారు. లూయి బ్రెయిలీ  214 వ  జన్మదిన వేడుకల్లో మనమందరం భాగస్వామ్యం కావడం చాలా గొప్ప విషయమని తెలిపారు. లూయీ బ్రెయిలీ ఒక గొప్ప మానవతావాది అని కొనియాడారు. ప్రపంచవ్యాప్తంగా అంధులు సైతం విద్య ద్వారా సమాజ అభివృద్ధిలో భాగస్వాములు కావాలనే ఏకైక లక్ష్యంతో లూయిస్ అంధుల కొరకు లిపిని కనిపెట్టారు. కనుకనే ఆయన పేరు మీదగా బ్రెయిలీ లిపి అని పేరు వచ్చింది. అంధులుకు ఈ లిపి ద్వారానే విద్య ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతుంది. ప్రపంచవ్యాప్తంగా 30 కోట్ల మంది అంధుల కోసం లిపిని కనిపెట్టి వారి జీవితాల్లో అక్షరజ్ఞానం కలిగించిన మహనీయుడు  లూయి బ్రెయిలీ ఫ్రాన్స్ దేశంలో 1809 జనవరి 4న ప్యారిస్‌కు 20 మైళ్ల దూరంలో ఉన్న రకూవే గ్రామంలో సైమన్ మానిక్ దంపతులకు నాల్గవ సంతానంగా జన్మించాడు. తండ్రి లెదర్‌తో గుర్రపు జీన్లు తయారు చేస్తూ కుటుంబ పోషణ సాగించేవాడు. మూడేళ్ల ప్రాయంలో లూయీస్ ఒక రోజు తన తండ్రి పని చేసే చోటుకి వెళ్లి అక్క డున్న పరికరాలతో ఆటలు ఆడుకుంటుండగా సన్నని చువ్వ ఒకటి వచ్చి కంటిలో గుచ్చుకుంది. దాన్ని పసిగట్టిన తండ్రి స్థానిక ఆస్పత్రికి తీసు కెళ్లాడు. అప్పటికే ఒక కంటి చూపు పూర్తిగా కోల్పో యాడు. దారిద్య్రం వల్ల మంచి వైద్యం తల్లిదం డ్రులు అందించలేకపోయారు. తర్వాత కొంత కాలానికి రెండవ కంటికి ఇన్‌ఫెక్షన్ సోకి రెండవ కన్ను కూడా పూర్తిగా పాడైపోయిం ది.  లూయీస్ తండ్రి తన కుమారుని కళ్లు లేకపోయినా సరే చదువుకోవాలని భావించి ఒక పెద్ద చెక్కపై మేకుల్ని అక్షరాల రూపంలో బిగించి లూయీస్‌ని వేలుతో స్పర్శ ద్వారా తాకమనేవాడు. ఈ విధంగా లూయిస్ బ్రెయిలీ లిపిని కనుగొనడం జరిగిందని తెలియజేయడం జరిగింది. అంధులకు ఉపయోగపడే పరికరాలను ఉచితంగా అందివ్వడం జరుగుతుందన్నారు. లూయిస్ బ్రెయిలీ అందుల శ్రేయస్సుకోసం చాలా కృషి చేయడం జరిగిందని తాను చేసిన కృషి ఫలితంగానే ఆరు చుక్కల లిపిని కనుగొనడం జరిగిందని వివరించడం జరిగింది. 1821లో చార్లెస్ బార్బేరియన్ అనే సైనికాధికారి శత్రువులకు అర్థం కాకుండా సందే శాలను సైనికులకు పంపడం కోసం 12 చుక్కల రహస్య కోడ్ భాషను ఉపయోగిస్తుండేవాడు. లూయీస్, చార్లెస్ బార్బేరియన్ దగ్గర చేరి 12 చుక్కల రహస్య కోడ్ భాషపై నిరంతరం పరి శోధించి చివరకు 1832లో 6 చుక్కల లిపిని కను గొన్నాడు. ఈ లిపిలోనే అంకెలను, చిహ్నాలను కూడా రూపొందించాడు. అంధుల కోసం లిపిని సృష్టించాడు. కనుక ఆయన పేరు మీదగానే బ్రెయిలీ లిపి అని పేరు వచ్చింది. అదేవిధంగా ఈరోజు ఎవరైతే ఆన్లైన్లో అప్లై  చేసుకున్న వారికి బ్లైండ్ స్టిక్స్, చెవి మిషన్లు అందజేయడం జరిగింది.