ఉద్యమ పందాలో అలుపెరగని యోధుడు కృష్ణ మాదిగ: సాల్మన్

Published: Friday July 08, 2022
బోనకల్ , జులై 8 ప్రజా పాలన ప్రతినిధి:దళిత సామాజిక న్యాయం కోసం దళితుల ఉన్నతి కోసం నిరంతరము పాటుపడుతూన్న దళిత బాంధవుడు కృష్ణ మాదిగని, 28 సంవత్సరాల ఉద్యమ పంధాలో అలుపెరగని యోధునిలా పేద ప్రజల సమస్యల పరిష్కారమే ఊపిరిగా రాష్ట్రవ్యాప్తంగా దళితులకు రిజర్వేషన్ లో ఎ బి సి డి వర్గీకరణ ద్వారానే సామజిక న్యాయం జరుగుతుందని తపనతో దళితులను సమాయత్త పరిచిన మేధావి అని తోటపల్లి సాల్మన్ అన్నారు. గురువారం మండల పరిధిలో కలకోట బస్టాండ్ ఆవరణలో ఏర్పాటు చేసిన కృష్ణ మాదిగ జన్మదిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రిజర్వేషన్ కొన్ని వర్గాల వారే అనుభవిస్తుంటే దళితుల్లో కొన్నివర్గాలు అణగారిన స్థితిలో ఉంటున్నామని,వాస్తవ పరిస్థితిని గుర్తించి సామజిక సమర శంఖము ఊది ఉద్యమాన్ని ఉవ్వెత్తున రగిలించి ఆనాటి నుండి నేటి వరకు ప్రభుత్వాల పెద్దల మీద ఒత్తిడి పెంచుతూ ఏబీసీడీ వర్గీకరణ కోసం నిరంతరం పనిచేస్తున్న ప్రజా చైతన్య మూర్తి ఎమ్మార్పీఎస్ ఉద్యమానికి ఆద్యుడు మందా కృష్ణ మాదిగ అని గుర్తు చేశారు. ఇదే రోజు ఈర్లమూడి గ్రామాన మొదలైన ఉద్యమం నేడు రాష్ట్రమంతా వ్యాపించి దళితులకు గౌరవాన్ని పెంచిందని అన్నారు. కృష్ణ మాదిగ ఉద్యమ స్ఫూర్తివల్ల, వికలాంగులకు పెన్షన్, చిన్నపిల్లలకు గుండె అపరషన్స్, పేదలకు ఆరోగ్యశ్రీ పధకం రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం కల్పించిందన్నారు.ఈ సందర్బంగా వికలాంగులకు నూతన వస్త్రములు బహుకరించారు. ఈ కార్యక్రమం లో రాష్ట్ర నాయకులు చిలక నాగరాజు, మండల గౌరవ సలహాదారు తోటపల్లి సాల్మన్,గ్రామ పెద్దలు యంగల కృష్ణ,తోటపల్లి శ్రీను, బరుగుల వెంకటేశ్వర్లు జాషువా,తదితరులు పాల్గొన్నారు.