ఆడపిల్లల పెళ్లిళ్లకు పెద్దన్న పాత్ర పోషిస్తున్న కేసీఆర్

Published: Tuesday January 31, 2023
 వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్
వికారాబాద్ బ్యూరో 30 జనవరి ప్రజా పాలన : ఆడపిల్లల పెళ్లిళ్లకు సీఎం కేసీఆర్ పెద్దన్న పాత్ర పోషిస్తున్నారని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు సోమవారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వికారాబాద్ మండల పరిధిలోని వివిధ గ్రామాల లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను వివిధ గ్రామాల సర్పంచుల ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వికారాబాద్ మండలానికి చెందిన లబ్ధిదారులకు మంజూరైన 59 లక్షల 6 వేల 844 రూపాయల చెక్కులను 59 మందికి పంపిణీ చేశామని వివరించారు. తెలంగాణ రాష్ట్రంలో పేదింటి ఆడబిడ్డలకు కొండంత అండగా నిలుస్తున్న కెసిఆర్ ను మరువద్దని సూచించారు. ప్రతి దశలో ఆడబిడ్డలకు తోడుగా సంక్షేమాన్ని అమలు చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కెసిఆర్ అని అన్నారు.
ఈ కార్యక్రమంలో వికారాబాద్ మండల ఎంపీపీ కామిడి చంద్రకళ జిల్లా రైతుబంధు అధ్యక్షుడు పాతూరు రామ్ రెడ్డి పులుమద్ది గ్రామ సర్పంచ్ తిమ్మాపురం మాధవరెడ్డి, వికారాబాద్ మండల బి ఆర్ ఎస్ పార్టీ మైనార్టీ సెల్ అధ్యక్షుడు సయ్యద్ గయాజ్ రాళ్లచిట్టంపల్లి సర్పంచ్ ముఫ్ల యాస్మిన్ గౌస్, ద్యాచారం సర్పంచ్ ఎల్లన్నోళ్ల అంజయ్య కొటాల గూడా సర్పంచ్ రాములు నాయక్ కామారెడ్డి గూడ సర్పంచ్ పురుషోత్తం రెడ్డి

 ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.