ఇబ్రహీంపట్నం మార్చి తేదీ 31 ప్రజాపాలన ప్రతినిధి **తుర్కయంజాల్ మున్సిపాలిటీలో బిఆర్ఎస్ పార్ట

Published: Saturday April 01, 2023
తుర్కయంజాల్ మున్సిపాలిటీ మన్నెగూడ జే ఏం  ఆర్ ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన బిఆర్ఎస్  ఆత్మీయ సమ్మేళన సభకు ముఖ్యఅతిథిగా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, క్యామ మల్లేష్, మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి, డి సి సి బి వైస్ చైర్మన్ కొత్త కురుమ సత్తయ్య, రంగారెడ్డి జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు వంగేటి లక్ష్మారెడ్డి హాజరైనారు. అనంతరం ఎమ్మెల్యే  మాట్లాడుతూ...మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్న తర్వాత ఏ రాష్ట్రంలో అమలు చేయనటువంటి పథకాలు మన తెలంగాణలోనే ప్రవేశపెట్టి పేద బడుగు బలహీన వర్గాలను ముందుకు తీసుకురావాలని ఉద్దేశంతో కళ్యాణ లక్ష్మి గాని షాదీ ముబారక్ గారి దళిత బంధు పథకంగాని, ఆసరా పింఛన్లు గాని అనేక పథకాలు ప్రవేశపెట్టి నేడు భారతదేశ మొత్తం తెలంగాణ వైపు చూసే విధంగా అన్ని రాష్ట్రాలు తెలంగాణలో ఉన్నటువంటి సంక్షేమ పథకాలను వేరే రాష్ట్రంలో కూడా లేవు. ఇతర రాష్ట్రాలు కూడా తెలంగాణ అభివృద్ధిని చూసి ఈరోజు వారి రాష్ట్రాల్లో కూడా తెలంగాణలో ఉన్నటువంటి పథకాలను అమలు చేయాలంటున్నారు.ఏది ఏమైనప్పటికీ ముఖ్యమంత్రి సూచన మేరకు నియోజకవర్గ స్థాయి నాయకులు, కార్యకర్తలు, అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి అభివృద్ధిని, సంక్షేమ పథకాలను, గడపగడపకు తీసుకుపోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది. పై స్థాయి నుండి కింది స్థాయి వరకు అందరం కలిసికట్టుగా పనిచేసి, బిఆర్ఎస్ పార్టీని విజయపథంలో ముందుకు  తీసుకెళ్లాలని కోరారు.
ఈ కార్యక్రమంలో తుర్కయంజాల్ మున్సిపాలిటీ అధ్యక్షురాలు అశ్విని, తుర్కయంజాల్ మున్సిపాలిటీ కౌన్సిలర్ కౌన్సిల్ ఫ్లో రీడర్ రామవత్ కళ్యాణ్ నాయక్,కౌన్సిలర్లు తాళ్లపల్లి సంగీత మోహన్ గుప్తా, సిద్ధల జ్యోతి జంగయ్య, పుల్ల గుర్రం కీర్తన విజయానంద రెడ్డి,గుండా భాగ్యమ్మ ధనరాజ్,వేముల స్వాతి అమరేందర్ రెడ్డి  ప్రజా ప్రతినిధులు, టిఆర్ఎస్ పార్టీ నాయకులు, మండల రైతు కోఆర్డినేటర్ కందాల బల్దేవరెడ్డి, సామ సంజీవరెడ్డి, మాజీ సర్పంచ్,కందాడ లక్ష్మారెడ్డి, గడ్డిఅన్నారం మార్కెట్ మాజీ చైర్మన్ కందాడ ముత్యం రెడ్డి, కొండ్రు వెంకటేష్,కార్యకర్తలు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు