ఘనంగా బైటింటి ఈశ్వర్ రెడ్డి జన్మదిన వేడుకలు

Published: Wednesday October 06, 2021
మేడిపల్లి, అక్టోబర్ 5 (ప్రజాపాలన ప్రతినిధి) : పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ 3వ డివిజన్ టీఆర్ఎస్ సీనియర్ నాయకులు బైటింటి ఈశ్వర్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని డివిజన్లోని తన కార్యాలయం ఆవరణలో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, డివిజన్ నాయకులు, అభిమానులు, కాలనీవాసులు ఈశ్వర్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు నాయకులు, అభిమానులు ఈశ్వర్ రెడ్డితో కేక్ కట్ చేయించి, జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.