పెంచిన పెట్రోల్, డీజిల్, వటగ్యాస్. ధరలు వెంటనే తగ్గించాలి

Published: Thursday March 24, 2022
సింగరేణి కాలరీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డి.బ్రహ్మనందం
నస్పూర్, మార్చి 23, ప్రజాపాలన ప్రతినిధి : పెంచిన పెట్రోల్, డీజిల్, వటగ్యాస్. ధరలు వెంటనే తగ్గించాలని 
సింగరేణి కాలరీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ (ఐఎఫ్ టీ యూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డి.బ్రహ్మనందం డిమాండ్ చేశారు. బుధవారం శ్రీరాంపూర్ లో కాంట్రాక్టు కార్మికులు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిజెపి నరేంద్ర మోడీ ప్రభుత్వం అన్ని రకాల నిత్య అవసర సరుకుల ధరలు పెంచుతూ పేద ప్రజల పైన పెనుభారం మోపుతున్నారు. పార్లమెంటులో బిజెపి ఎంపీల సంఖ్య అధికంగా ఉండడంతో ఇష్టారాజ్యంగా చట్టాలు చేస్తున్నారని అన్నారు. ప్రస్తుతం పెట్రోల్ డీజిల్ ధరలు పెద్ద మొత్తంలో పెంచడం వల్ల అనివార్యంగా ట్రాన్స్పోర్ట్ చార్జీలు పెరిగి నిత్యావసర సరుకుల ధరలు పెరగడం వల్ల ప్రజలు కనీసం ఒక్క పూట కూడా తిండి తిన లేని దౌర్భాగ్య పరిస్థితి భారతదేశనికి వస్తుందని తెలిపారు. ఇప్పటికే అన్ని రకాల ధరలు విపరీతంగా పెరిగి కొనుగోలు శక్తి పడిపోయి సంవత్సరానికి 25 లక్షల మంది ఆకలితో  చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో ఉన్న వనరులన్నీ పెట్టుబడిదారులకు అప్పజెప్పి అన్ని రకాల వస్తువుల ధరలు పెంచి పేద ప్రజల జీవితాలతో ఆడుకుంటున్న బీజేపీ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పాలన్నారు. పెంచిన వంట గ్యాస్, పెట్రోలు, డీజిల్, నిత్యవసర సరుకుల ధరలు తగ్గే వరకు పోరాటాలు చేయాలని  పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అప్పారావు, వెంకన్న, పున్నం, సుధాకర్, రాంబాబు స్వామి, శ్రీను, జ్యోతి, కవిత, శారద, సత్యక్క, మల్లేశ్వరి, తదితరులు పాల్గొన్నారు.