డిస్ట్రిబ్యూటర్, డీలర్స్ కు కావేరి 206 రకంపై అవగాహన హాజరైన నేషనల్ సేల్స్ హేడ్ రాజేష్ వర్మ..

Published: Friday December 30, 2022
ఖమ్మం, డిసెంబర్ 29 (ప్రజా పాలన న్యూస్):
 ఖమ్మంజిల్లా రఘునాధపాలెం మండలంలోని మంచుకొండ గ్రామంలో గురువారం కావేరి సీడ్స్ వారి 206 రకం విత్తనాలపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నేషనల్ సేల్స్ మేనేజర్ రాజేష్ వర్మ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కావేరి రకం మిరప, పత్తి,  టమాట, వంకాయ, బెండకాయ, తదితర విత్తనాలు సాగు చేస్తే అధిక దిగుబడులు వస్తాయని తెలిపారు. అంతేకాకుండా డిస్టిబూటర్లకు, డీలర్స్ & రైతులకు క్షుణ్ణంగా అర్థమయ్యే విధంగా ఓ రైతు మిర్చిని ఎకరాకు సుమారు 20 నుండి 25 క్వింటాలు దిగుబడి వచ్చే పొలంలో ఈ సదస్సు నిర్వహించారు.  కావేరి రకం విత్తనాలు చీడ, పీడలను తట్టుకొని కిందనుంచి పైకి కాపు వస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో గుంటూరు రీజినల్ మేనేజర్ శ్రీనివాస్, హైదరాబాద్ రీజినల్ మేనేజర్ నాగేంద్ర బాబు, ఖమ్మం సేల్స్ లీడ్ నరేంద్ర, డిస్టిబూటర్స్ కృష్ణ తులసి చౌదరి , రైతు మిత్ర పురుషోత్తం వివిధ గ్రామాల మండలాల రైతులు & డీలర్స్ అధిక సంఖ్యలో పాల్గొన్నారు.