డాక్టర్ వాసిరెడ్డి రామనాథంని సన్మానించిన పారుపల్లి సురేష్

Published: Monday April 10, 2023

మధిర, ఏప్రిల్ 9 ప్రజా పాలన ప్రతినిధి: 1982సం ఎన్టీఆర్ తెలుగు దేశం పార్టీ స్థాపించిన, నాటినుండి నేటివరకు, సుదీర్ఘ కాలంగా తెలుగు దేశం పార్టీకి సేవచేసి , మధిర నియోజకవర్గ ఇన్చార్జిగా, జిల్లా పార్టీ అధ్యక్షులుగా రాష్ట్రపార్టీ ఉపాధ్యక్షులుగా నిబద్ధత కలిగిన నాయకుడుగా గుర్తింపు తెచ్చుకొని, మొన్న పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా సన్మానించబడిన డాక్టర్ వాసిరెడ్డి రామనాథం ని, ఆదివారం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పారుపల్లి సురేష్ , మధిరలోని ప్రజా వైద్యశాల నందు డాక్టర్ వాసిరెడ్డి రామనాథం ని సన్మానించడం జరిగింది.ఈ కార్యక్రమంలో చేకూరి శేఖర్ బాబు, మల్లాది హనుమంతరావు, మైనేడి జగన్ మోహన్ రావు, రావట్ల సత్యనారాయణ, మైనీది రవి, వట్టికొండ మోహనరావు, వట్టికొండ నాగేశ్వరరావు, గడ్డం మల్లికార్జునరావు, మేడా వెంకటేశ్వరావు, తదితరులు పాల్గొన్నారు.