సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న బూర్గంపాడు మండలం సిపిఎం బత్తుల వెంకటేశ్వర్లు.

Published: Monday December 19, 2022
బూర్గంపాడు (ప్రజా పాలన.) 

మండలంలో సుందరయ్య నగర్ తాళ్లగూమ్మురు క్రిస్మస్ పండగ సందర్భంగా సిపిఎం పార్టీ మండల కమిటీ చర్చి దేవాలయాలకు వెళ్లి డిసెంబర్ 25న జరిగే పండక్కు ముందుగా క్రిస్టియన్ పండగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పైన ఖమ్మంలో ఈనెల 29న బహిరంగ సభ జరుగుతుంది .ఈ సభకు ప్రజలు కదిలి రావాలని ప్రభుత్వం ఏదైతే ప్రజలకు హామీలు ఇచ్చారు అవి అమలు చేయాలని ప్రతి ఒక్కరికి స్థలం ఉన్నవారికి  5లక్షలు ఇవ్వాలని స్థలం లేని వారికి స్థలం ఇచ్చి డబుల్ బెడ్ రూమ్ గోదావరి ముంపు నుండి ప్రజల్ని కాపాడాలని కరకట్ట కట్టించాలని 1200 కోట్లు ఏదైతే అన్నారో అవి అమలు చేయాలని అన్నారు . కేంద్ర ప్రభుత్వం నిత్యవసర సరుకులు విపరీతంగా ప్రజల పైన భారాలు మేపుతూ వంటగ్యాస్ ధర 2014లో 410 ఉంటే ఈరోజుకి వంటగ్యాస్ ధర 1200 చేరింది అదే కాదు మంచి నూనె గాని పెట్రోల్ డీజిల్ అన్నిటి పైన జిఎస్టి పెంచి ప్రజల పైన భారాలు మోపుతూ బానిసత్వం లోకి తీసుకొస్తున్న మోడీ ప్రభుత్వం అందుకోసం ఖమ్మంలో జరిగే బహిరంగ సభకి వందలాదిమంది కదిలి రావాలని సిపిఎం మండల కమిటీ పిలుపునిస్తోంది ఈ కార్యక్రమంలో పాపినేని సరోజన చందర్రావు కౌలూరి నాగమణి బత్తుల ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు