అంగరంగ వైభవంగా నిర్వహించిన శ్రీ స్వామి అయ్యప్ప ఆ రట్టు ఉత్సవ కార్యక్రమం

Published: Thursday December 02, 2021
మధిర డిసెంబర్ 1 ప్రజాపాలన ప్రతినిధి : మధిర మున్సిపాలిటీ పరిధిలో లడక బజారు స్వామి అయ్యప్ప దేవాలయంఅయ్యప్ప దేవాలయం, నందు 14వ ఉత్సవంలో భాగంగా బుధవారం శ్రీ స్వామి అయ్యప్ప వారికి లడక్  బజార్ వైరా నది తీరమున ఆ రట్టు అనగా నది స్థానం మహోత్సవం నిర్వహించబడినది ఈ ఆ రట్టు మహోత్సవం కార్యక్రమానికి పోటెత్తిన భక్తులు ముఖ్యంగా మహిళలు అయ్యప్పలు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది తదుపరి ఈ ఆరట్టు మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి భక్తులకు పసుపు కుంకుమతో అభిషేకించిన పసుపు కుంకుమ ప్రసాదాన్ని మహిళలకు నది ఒడ్డున ప్రసాదముగా అందజేయ బడినది ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తునమహిళలు మాలధారులు స్వామి తో నదీస్నానమాచరించి స్వామి వారికీ తమ ఆటపాటలతో ఆనందం తెలియజేయడం జరిగినది తదుపరి భక్తులకు స్వామివారి దాతల సహకారంతో అన్నప్రసాద వితరణ నిర్వహించడం జరిగినది ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ ఆలయ కమిటీ సభ్యులు ప్రతి సంవత్సరం లాగానే మండల పూజలో భాగంగా స్వామి అయ్యప్ప దేవాలయంలో ప్రతి ఏటా జరిగే కార్యక్రమంలో 14వ సంవత్సరం కాబట్టి ఈరోజు అరటి ఉత్సవం ఉదయం నుంచి స్వామివారికి ఉదయం నుంచి అభిషేకాలు మధ్యాహ్నం స్వామి వారి ఉత్సవాలు మధ్యాహ్నం అన్నదానం సాయంత్రం పడిపూజ కార్యక్రమాలు జరుగుతాయని ప్రతి రోజు నిత్య దాతల సహకారంతో అన్నదానం జరుగుతుందని ఈ స్వామి దేవాలయము నందు ప్రజల సహకారంతో 14 మండల పూజా కార్యక్రమం దిగ్విజయం చేశారని తెలుపుతూ అందరికీ పేరుపేరునా స్వామి అయ్యప్ప కరుణ కటాక్షాలు ఉండాలని తెలిపారు ఈ కార్యక్రమంలో చలవాది ధర్మారావు శ్రీనివాసరావు పుల్లారావు మురళి బాబు శ్రీనివాస రావు నాగేశ్వరావు పసుపు లేటి నాగేంద్ర శ్రీను రమేష్ జగన్మోహన్రావు అప్పారావు స్వాములు అయ్యప్ప లు పాల్గొన్నారు