ప్రభుత్వ ఉద్యోగులు ప్రజలకు మంచి సేవలు అందించాలి

Published: Saturday February 25, 2023
* వికారాబాద్ జిల్లా కలెక్టర్ సి నారాయణరెడ్డి
వికారాబాద్ బ్యూరో 24 ఫిబ్రవరి ప్రజాపాలన : ప్రభుత్వ ఉద్యోగులు ప్రజలకు మంచి సేవలందించాలనే ఉద్దేశంతో అటెండెన్స్ యాప్ ను ప్రవేశపెట్టడం జరిగిందని, ఎవరిని ఇబ్బంది పెట్టే ఉద్దేశ్యం కాదని జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా అధికారులతో అటెండెన్స్ యాప్ అమలుపై జిల్లా కలెక్టర్ టెలి కాన్ఫరెన్స్ ద్వారా  సమీక్ష సమావేశం నిర్వహించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ ఉద్యోగులందరూ  రెగ్యులర్ గా విధులు నిర్వహించి ప్రజలకు మంచి సేవలు అందిస్తే జిల్లాను టాప్ 5 లో ఉంచవచ్చన్నారు. ఉద్యోగులందరూ పద్ధతి మార్చుకొని సోమవారం నుండి వంద శాంతం అటెండెన్స్ యాప్ ను అమలు చేయాలన్నారు.  గత 20 రోజులుగా అటెండెన్స్ యాప్ పై దృష్టి సారించినప్పటికీ ఇంకా కొన్ని శాఖలలో సిబ్బంది యాప్ ను డౌన్ లోడ్ చేసుకోలేదని కలెక్టర్ ఆయా శాఖల అధికారులను తీవ్రంగా మందలించారు. ఈ సందర్భంగా కొంతమంది అధికారులు స్పందిస్తూ షిఫ్టింగ్ డ్యూటీలు మరికొన్ని ఇతర  టెక్నికల్ సమస్యల వల్ల యాప్ డౌన్ లోడ్ చేసుకోలేకపోవడం జరిగిందని తెలియజేశారు.  సోమవారం నుండి ప్రతి ఒక్కరూ   వంద శాతం హాజరును యాప్ ద్వారా నిర్వహించే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు.