ప్రజాసమస్యల పరిష్కారానికి వారధులుగా డివిజన్ కమిటీలు : ఖైరతాబాద్ ఎం ఎల్ ఏ .దానం నాగేందర్

Published: Friday October 01, 2021
అమీర్ పేట్ (ప్రజాపాలన ప్రతినిధి) : ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజలలోకి తీసుకెళ్లేందుకు, ప్రజాసమస్యలను ప్రభుత్వానికి తెలియజేసేందుకు ఈ కమిటీలు వారధిలా ఉపయోగపడతాయని అన్నారు ఖైరతాబాద్ ఎం ఎల్ ఏ.దానం నాగేందర్. వెంకటేశ్వర కాలనీ డివిజన్ లో నూతనంగా ఎన్నిక అయిన కమిటీ సభ్యులను ఎమ్మెల్యే దానం నాగేందర్, టి.ఆర్.ఎస్. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండి రమేష్, స్థానిక కార్పొరేటర్ మన్నే కవితలు సన్మానించారు... ఈ సందర్బంగా దానం నాగేందర్ మాట్లాడుతూ నూతనంగా ఎన్నిక అయిన కమిటీ సభ్యులు రోజు ప్రజల మధ్య ఉంటూ స్థానికంగా ఉన్న సమస్యలను తన దృష్టికి తీసుకురావడంతో పాటు ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలలోకి తీసుకెళ్లే బాధ్యత ఈ కమిటీ సభ్యులు తీసుకోవాలన్నారు... ఈ సందర్బంగా బండి సంజయ్ కి దానం నాగేందర్ చురకలంటించారు... తెలంగాణలోని పోడుభూములు కూడా సస్యశామలంతో, పచ్చదనంతో కలకలలాడుతూ రైతులందరు వ్యవసాయం చేస్తుంటే యాత్ర నిర్వహిస్తున్న బండి సంజయ్ ఇది గుర్తించకపోవడం విచారకరం అన్నారు... తెలంగాణ రాష్ట్రం సస్యశామలంగా కోటి ఎకరాల మాగాణి అయి బంగారు తెలంగాణగా చేయాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ కల నిజం అవుతు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ చూసినా చెరువు, ప్రాజెక్టులు జలకలను సంతరించుకున్నాయని అవి బండి సంజయ్ కి కనిపించడం లేదా అని ప్రశ్నించారు... రైతుల పొట్టగొట్టి, వారి ఉసురు పోసుకుంటున్న కేంద్ర ప్రభుత్వం గురించి మాట్లాడని బండి సంజయ్ తెలంగాణ రాష్ట్రంలో రైతుల గురించి నిరంతరం కష్టపడే సియం కేసీఆర్ గురించి మాట్లాడే నైతిక హక్కు బండి సంజయ్ కి లేదన్నారు...