భగవద్గీత 18 రోజుల పాటు ప్రవచనం, పారాయణం లో పాల్గొనండి

Published: Friday November 26, 2021
ఇబ్రహీంపట్నం అక్టోబర్ 25 ప్రజాపాలన ప్రతినిధి : తిరుమల తిరుపతి దేవస్థానము హిందూధర్మప్రచారపరిషత్ ఆధ్వర్యంలో సకల వేదసారం, పరమ పవిత్రమైన భగవద్గీతను 18 ఆలయాలలో 18 రోజులపాటు 18 మంది ప్రముఖ పండితులతో రోజుకొక అధ్యాయంచొప్పున పారాయణ మరియు ప్రవచనం నిర్వహింప తలపెట్టినైనది. ఆంధ్రప్రదేశ్, హైదరాబాద్, చెన్నై, బెంగుళూరులలోని తిరుమల తిరుపతి దేవస్థానముల పరిధిలోని (ఉపమాక, పిఠాపురం, అప్పలాయగుంట, నారాయణవనం, ఒంటిమిట్ట, దేవునికడప, జుబ్లిహిల్స్ హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, తిరుపతి కోదండ రామాలయం) సంబంధిత ఆలయాలలో మరియు దేవదాయ ధర్మాదాయశాఖ అధీనంలోని (అరసవిల్లి, సింహాచలం, అన్నవరం, ద్వారకాతిరుమల, మంగళగిరి, నెల్లూరు రంగనాథస్వామి, కదిరి, అహోబిలం) ఆలయాలలో 27.11.2021 నుండి 14.12.2021 (గీతాజయంతి) వరకు అనుదినము సాయంత్రం 06.00గం. నుండి 7.30 గం. వరకు భగవద్గీత పారాయణం మరియు ప్రవచనం గావించడానికి నిశ్చయించారని తెలియజేశారు. స్థానికులైన భక్తులు ఆయా దేవాలయాలలో ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఆచరణశీలురుగా, ధర్మనిరతులుగా కాగలరని ఆశిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపారు.