ఉత్తమ సేవ ప్రశంసాపత్రం అందుకున్న మల్లాపూర్ ఎస్సై - జి.రాజు నాయక్

Published: Monday August 16, 2021
మల్లాపూర్, ఆగస్టు 15 (ప్రజాపాలన ప్రతినిధి) : జిల్లా కేంద్రం జగిత్యాల ఖిల్లాలో 75వ స్వతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఉత్తమ సేవలకు గాను మల్లాపూర్ ఎస్సై జి.రాజు నాయక్ మరియు కానిస్టేబుల్ సురేష్ నాయక్ కు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ చేతుల మీదుగా ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. వారికి ప్రశంస పత్రం అందడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కోరుట్ల ఎమ్మెల్యే ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్, జిల్లా కలెక్టర్ జి.రవి నాయక్ జిల్లా ఎస్పీ సింధు శర్మ మరియు ఉన్నత స్థాయి నాయకులు అధికారులు పాల్గొన్నారు.