వీఆర్ఏల పేస్కేల్ జాతర - బోనాల ఊరేగింపు

Published: Wednesday August 24, 2022

ఇబ్రహీంపట్నం ఆగస్టు తేదీ 23ప్రజాపాలన ప్రతినిధి

ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయం ముందు తెలంగాణ రాష్ట్ర విఆర్ఏల జేఏసీ ఆధ్వర్యంలో నిరవధిక సమ్మె 30 రోజులుగా కొనసాగుతున్న విషయం విధితమే. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర  వి ఆర్ ఏ జె ఏ సి  కో కన్వినర్ వై వెంకటేష్ యాదవ్ , రంగ రెడ్డి జిల్లా చైర్మన్ ఎడ్ల వెంకటేష్ , జిల్లా ప్రధాన కార్యదర్శి యత భాస్కర్,  జిల్లా కన్వీనర్ ప్రసాద్, ఇబ్రహీంపట్నం డివిజన్ వి ఆర్ ఏ  జె ఏ సి చైర్మన్ బుద్ధి రాజేష్,  ఇబ్రహీంపట్నం నియోజకవర్గ మండల అధ్యక్షులు ఇబ్రహీంపట్నం కర్ణేశ్వర్ , యాచారం యార జంగయ్య, అబ్దుల్లాపూర్ మెట్టు  ప్రశాంత్, మంచాల పండి నాగరాజ్,  వి ఆర్ ఏ లు పాల్గొని
విన్నూత రీతిలో పే స్కేల్ జాతర- బోనాల ఊరేగింపు 
కార్యక్రమాన్ని నిర్వహించి అమ్మవారికి బోనాలు సమర్పించారు. అదేవిధంగా
రంగారెడ్డి జిల్లా బద్వేల్ ఎక్స్ రోడ్ నుండి రాజేంద్రనగర్ ఆర్డీవో కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి నిరసన తెలుపడం జరిగిందని వీఆర్ఏ జేఏసీ నాయకులు తెలిపారు.