సంక్షేమానిరైతు కి పెద్దపీట వేస్తున్న ప్రభుత్వం

Published: Thursday September 29, 2022
ప్రజా పాలన ప్రతినిధి. నవాబుపేట, రాష్ట్రంలోని రైతుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తుందని జెడ్పిటిసి రవీందర్ రెడ్డి అన్నారు. బుధవారం నవాబుపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సర్వసభ్య సమావేశం ఆ సంఘం అధ్యక్షుడు చైర్మన్ అధ్యక్షతన మాడేమోని నర్సింహులు అధ్యక్షతన జరిగింది.
ఈ సందర్భంగా రవీందర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని రైతులు ఉమ్మడిఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత పాలకుల పాలనలోఎదుర్కొన్న సమస్యలను సమూలంగా పరిష్కరించేందుకు ప్రస్తుతం తెరాస ప్రభుత్వం కృషి చేస్తుందని  అన్నారు. అందులో భాగంగానే బ్యాంకులు, సహకార సంఘాల ద్వారా విరివిగా  రుణ సహాయాలను అందించడంతోపాటు రైతుబంధు, రైతు బీమా తదితర పథకాల ద్వారా వారికి బాసటగా నిలుస్తుందని అన్నారు. సమావేశానికి అధ్యక్షత వహించిన సంఘం చైర్మన్ నర్సింలు మాట్లాడుతూ సహకార సంఘం ద్వారా ప్రతి సంవత్సరం మండలంలోని రైతులకు దీర్ఘకాలిక,స్వల్పకాలిక
 రుణాలను అందజేస్తూ
 వారికి అండగా నిలుస్తున్నామని అన్నారు. గతంలో సంఘం నుండి రుణాలను పొందిన రైతులు తమ రుణ బకాయిలను వెంటనే చెల్లించి తోటి రైతులకు రుణాలు మంజూరు చేసేందుకు సహకరించాలని
 చైర్మన్ కోరారు. ఈ సమావేశంలో ఎంపీపీ అనంతయ్య, వైస్ ఎంపీపీ సంతోష్ , రెడ్డిమహబూబ్ నగర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ డైరెక్టర్ చెన్నయ్య, పర్వతాపూర్ మైసమ్మ దేవాలయ కమిటీ అధ్యక్షుడు పాశం గోపాల్ ,
సంఘం సిఈఓ హనుమంతు, తదితరులు పాల్గొన్నారు.