డీలర్ల నియామకం లో అవకతవకలు శంకరపట్నం నవంబరు 05ప్రజాపాలన ప్రతినిధి

Published: Monday November 07, 2022

హుజూరాబాద్ రెవెన్యూ డివిజన్ పరిదిలోని రేషన్ డీలర్ షాప్ లలో వివిధ కారణాలతో ఖాలీలుగా ఏర్పడిన అలాగే కొత్తగా ఏర్పటు చేసిన  మొత్తం  53 డీలర్ షాప్ ల నిర్వాహణ  కై కొత్త డీలర్ల నియామకo కోసం ఇటీవలె నిర్వహించిన రాత పరీక్షలో అలాగే మౌఖిక పరీక్షలో అవకతవకలు జరిగినాయని మౌఖిక పరీక్షకు ఎంపీక అయిన అభ్యర్ధులు ఆరోపించారు.రాత పరీక్షలో తక్కువ మార్కులు వచ్చిన అభ్యర్తులకు మౌఖిక పరీక్షలో ఎక్కువ మార్కులను కలిపి ప్రజాప్రతినిధుల అనుచరులకే వచ్చేలా అధికారులు సహకరించి, అలాంటివారికే  డీలర్ నియమాలు ఇచ్చారని వారు ఆరోపించారు. ఈ అవకతవకల పై జిల్లా కలెక్టర్కు రాత పూర్వకంగా పిర్యాదు చేసినట్లు వారు తెలియపరు.ఇట్టి నియమకాలను రద్దు చేసి తిరిగి పరీక్ష నిర్వహిచాలని శంకరపట్నం, హుజూరాబాద్, జమ్మికుంట, సైదాపూర్ మండలాల అభ్యర్ధులు డిమాండ్ చేసారు.